ఫోకస్

అది పాక్షిక న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయాల్లోకి మహిళలకు ప్రవేశం ఉండాల్సిందే. సనాతన ధర్మం మహిళలకు చాలా గౌరవం ఇచ్చింది. వారిని దేవతలుగా పూజించింది. దేవతలను ఆడవారు మగవారు అనే తేడా లేకుండా అందరూ మొక్కుతారు. ఏ కాలంలో ఇలాంటి నిబంధనలు విధించారో? ఎందుకు విధించారో తెలియదు కానీ కొన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించకపోవడం మంచిది కాదు. ఆలయాల ప్రవేశం అందరికీ ఉండాలి. ఒకప్పుడు పాటించిన ఆచారాలను మార్చుకున్నాం. ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి, అవి తప్పు అని గ్రహించి మానుకున్నాం. అలానే గతంలో వితంతు వివాహాలను అంగీకరించలేదు. ఇది మంచి సంప్రదాయం కాదని గ్రహించి వితంతు వివాహాలను ఆమోదించాం. ఇదే విధంగా అనేక అంశాల్లో మార్పును స్వాగతించాం. ఆలయాల సందర్శనలో సైతం ఆరోగ్యకరమైన మార్పుకు స్వాగతం పలకాలి. స్ర్తిలు చిత్తశుద్ధితో ఆలయాల్లోకి ప్రవేశం కోరితే బాగుండేది, ఆహ్వానించదగిన పరిణామం కానీ, మహిళా హక్కులు అంటూ హిందూ వ్యతిరేక సంస్థలు తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి భక్తి ఉంటే స్వాగతించాలి, అలాంటి బృందం కాదది. కాలం మారింది మహిళలకు ఆలయాల ప్రవేశానికి అవకాశం ఉండాలి అని మహిళలు అడిగితే బాగుండేది. అలా అడిగినప్పుడు ఆలయ నిర్వాహకులు వారి మాటను మన్నించాలి. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలను మార్చుకున్నాం. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉండాల్సిందే, ఈ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. అయితే ఆలయంలో ప్రవేశం కోరుతూ ఆందోళన చేసిన బృందాలను విమర్శించేందుకు వారి ఉద్దేశాన్ని బహిర్గతం చేసేందుకు వేరే వేదికలను ఉపయోగించుకోవాలి, నిర్ణయాన్ని మాత్రం స్వాగతించాలి. సంప్రదాయం కాదు చట్టం ముఖ్యం అంటూ ఆలయాల వ్యవహారాలపై సుప్రీంకోర్టు చెప్పిన మాట స్వాగతించాలి. చెప్పిన విషయం సరైనదే, కానీ న్యాయమే. కానీ కోర్టుది పాక్షిక న్యాయం అనిపిస్తోంది. సాంప్రదాయాల కన్నా రాజ్యాంగం ముఖ్యం అని హిందువుల విషయంలో చెప్పిన కోర్టులు ఇతర మతాల సంప్రదాయాలపై ఇదే మాట చెప్పగలవా?

- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి