ఫోకస్

ఆలయాలు.. ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవానం దేవస్య వా ఆలయా’ అన్నారు రుషి పుంగవులు. సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం, పురాణం అన్నింటి సంగమ స్థానం హిందూ దేవాలయాలు. దేవాలయం అంటే మత సంబంధమైన ప్రార్థనలకు వినియోగించే పవిత్రమైన కార్యస్థానం. హిందూ సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణ పద్ధతులు విధానాలు ఇందులో కనిపిస్తుంటాయి. దేవాలయాలు ప్రార్ధనకోసం, పూజకోసం, దేవతా విగ్రహాలను ఇతర ఆరాధ్య వస్తువులను సందర్శించేందుకు ఏర్పాటు చేసినవే. అందుకే మనవాళ్లు దేవాలయాన్ని సప్తసంతానాల్లో ఒకటిగా భావిస్తుంటారు. భూదేవస్థాపనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వేష్మం, కీర్తనం, హార్మ్యం, విహారం అని విమాన ప్రాసాదం అని కూడా పిలవడం జరుగుతోంది. ఇలాంటి ప్రదేశాలను సందర్శించేందుకు ఆంక్షలు ఉండటం విడ్డూరం. దీనికిసైతం ఇతిహాసాలను, పురాణాలను, సంప్రదాయాలను ఇంతకాలం కారణాలుగా చెబుతూ వచ్చారు. కాని కాలం మారింది, అందరిలో తపన పెరిగింది. ఇటు స్ర్తిలు, పురుషులతోపాటు అంతా దేవాలయాల సందర్శనకు ఇష్టపడుతున్నారు. దేవునిలో లేని వ్యత్యాసం మనుషుల మధ్య ఎందుకనే వాదన పుట్టుకొచ్చింది. దేశంలో కొన్ని దేవాలయాల్లో స్ర్తిల సందర్శనపై ఆంక్షలు ఉంటే, కొన్ని దేవాలయాల్లో పురుషుల సందర్శనపై ఆంక్షలు ఉన్నాయి. ఇపుడు దేవాలయాల తీరు మారుతోంది. ఆంక్షలను సడలిస్తున్నారు. వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానంగా ఉన్నవే దేవాలయాలు. ప్రాచీనకాలం నుండి తెలుగు రాష్ట్రాల శిల్పకళకు, చిత్రకళకు, వాస్తు కళకు, పుణ్యక్షేత్రాలకు ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు కూడా ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిథిలప్రాయమైన దేవాలయాల్లో కూడా నేటికీ పూజా పునస్కారాలు జరుగుతూనే ఉన్నాయి. భగవంతుడి మీద భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్ప సౌందర్యాన్ని, దేవాలయాల నిర్మాణాన్ని మట్టిపాలుచేసుకోలేక, నాటి మహావైభవాన్ని గుర్తుచేసుకుని వాటిని పునరుద్ధరించాలనే మహాకాంక్ష ప్రభుత్వాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై జరుగుతున్న చర్చపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.