ఫోకస్

విద్య ప్రాథమిక హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య ప్రాథమిక హక్కు అన్న సంగతి ప్రభుత్వాలు మర్చిపోయాయి. కాబట్టే ఈ రోజు విద్యా రంగం భ్రస్టుపట్టిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వాలే గుర్తించకపోతే ఇక ప్రైవేట్ వ్యవస్థలు ఏం గుర్తిస్తాయి. విద్యార్థుల సంఖ్య లేదని పాఠశాలలను మూసివేయడం ఎంతవరకు కరెక్ట్? ఏవో కుంటిసాకులు చెప్పి పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రభుత్వం విద్యావ్యవస్థను తమ చేతులతోనే భ్రస్టుపట్టించి వేస్తున్నట్లు ఉంది. ఏ ఏడాదికాఏడాది ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థను పటిష్టం చేసుకుంటూ వెళ్లాలన్న లక్ష్యం ప్రభుత్వాల వద్దలేదు. అదే ఉంటే అసలు బడ్జెట్ కేటాయింపుల్లోనే సమస్య రాకూడదు. విద్యా రంగానికి ప్రభుత్వాలు చేసే బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉంటున్నాయి. గతంలో కొఠారి కమిషన్ అప్పటి స్థితిగతులకు అనుగుణంగా బడ్జెట్‌లో 5 నుంచి 6 శాతం నిధులు విద్యకు కేటాయించాలని సిఫార్సు చేశారు. ఇప్పుడు పెరిగిన వ్యయం, ఇతర పరిస్థితులను లెక్కలోకి తీసుకుని 11 నుంచి 15 శాతం ఉండాలి. కానీ 10 శాతం లోపు మాత్రమే బడ్జెట్ ఉంటోంది. దీంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడం లేదు. ఒకపక్క ఉపాధ్యాయులు లేరు. మరోవైపు పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనపథకం సరిగ్గా అమలుకాక, ఇతర ఆర్థిక కారణాలతో బడి మానేయడంవల్ల డ్రాప్ ఔట్లు అధికంగా ఉంటున్నాయి. అసలు డ్రాప్ ఔట్లు ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై లోతుగా ఆరా తీయకుండా విద్యార్థుల సంఖ్య ఎక్కువ లేదని పాఠశాలలను మూసివేస్తున్నారు. పాఠశాలల స్థాయినుంచి కళాశాల, విశ్వవిద్యాలయాల వరకు భారీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో ఇక విద్యాప్రమాణాలు పెరగాలంటే ఎలా సాధ్యపడుతుంది? విశ్వవిద్యాలయాల్లో వౌలిక సదుపాయలు కొంతవరకు బాగున్నా, పాఠశాలలు, ఉన్నత పాఠశాలల స్ధాయిలో వౌలిక సదుపాయలు సరిగ్గా ఉండడం లేదు. ముఖ్యంగా బడి మానివేస్తున్నవారిలో బాలికలు ఎక్కువగా ఉంటున్నారు. విద్యా రంగంలో సంస్కరణలు చేస్తున్నారంటే అది కార్పొరేట్ విద్యాసంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తుండడం తప్ప మరేమీలేదు. ప్రభుత్వం ఒకచేత్తో విద్యను నిర్లక్ష్యం చేయడం, రెండోచేత్తో ప్రైవేటు బడులను ప్రోత్సహించడం జరుగుతోంది. ఇది సరైన విధానం కాదు. ఐఐటిల్లో ఫీజులను ఇటీవల భారీగా పెంచారు. ఎందుకు పెంచారంటే త్వరలో ప్రైవేటు యూనివర్శిటీలు అమల్లోకి రానున్నాయి. ఆ సమయంలో ప్రభుత్వం తక్కువ ఫీజు కలిగి ఉంటే, ప్రైవేటు విద్యాసంస్థల్లో పెద్దగా ఎవరూ చేరే అవకాశం ఉండరు. కాబట్టి ముందే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజులను పెంచితే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఎర్ర తివాచి పరచి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడమంటే విద్యను కార్పొరేట్ చేయడం తప్ప మరొకటి కాదు.
- కె.నారాయణ
సిపిఐ, జాతీయ కార్యదర్శి