ఫోకస్

అనాలోచిత చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత ఛాందస భావజాలంతోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఉగ్రదాడులలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. ఇది అనాలోచిత చర్యే. అంతరిక్షంలో కోట్లాది గ్రహాలు తిరుగుతున్నాయి. టెలిస్కోపుద్వారా చూస్తున్నాం. పరిశోధనలు జరుగుతున్నకొద్దీ గ్రహాలు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మత ప్రవచనాలు, మత గ్రంథాలు, దేవుళ్లు అని చెబుతున్నారు, దేవుళ్లే తమతో వినాశనాలు చేయిస్తున్నారనే మూఢనమ్మకాలు పుట్టుకొస్తున్నాయి. ఇది అంధత్వం, అంధత్వంతో ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. దాడులకు పాల్పడుతున్నారు. ఇది యావత్ సమాజానికే చేడు. ఇది విచ్ఛిన్నకరం, ఇది ప్రతి సమాజంలో ఉంది. ఒకరు మంచి చేస్తుంటే మరొకరు చెడగొడుతుంటారు. ఇది సమాజంపై అవగాహన రాహిత్యం. కొందరు కులమని, ఇంకొందరు మతమని, వర్గం అంటూ మరికొందరు విచ్ఛిన్నకర సంఘనలకు పాల్పడుతుంటారు. ఇది సమాజానికి చెడు మిగుల్చుతుంది తప్ప మంచిది కాదు. సమాజంలోని ఐదు శాతం ప్రజలు మాత్రమే ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులుంటాయి. వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప విచ్ఛిన్నకరశక్తులకు అడ్డుకట్ట వేయలేం. తీవ్రవాదం అన్నది ఒక మహా భూతం. ఇది యువతను చెడువైపు మళ్లిస్తుంది. 25ఏళ్లలోపు యువకులు సోషలిజం, సమసమాజాం, సమానత్వం అంటూ తామే సర్వంగా ఫీలవుతుంటారు. కాని వారికి గుండె ఉండదు. సర్వం తామే అనుకొని తీవ్రవాదం వైపు మళ్లే యువతకు బాధ్యతలుండవు. బాధ్యతలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నానికి వచ్చినప్పుడు వారికి మెదడు పనిచేయదు. కాబట్టి ఉగ్రవాదం, తీవ్రవాదం, విచ్ఛిన్నకరం ఇవి సమాజానికి మంచివి కావు.

-పేర్వారం రాములు, రిటైర్డ్ డిజిపి