ఫోకస్

రైతు సమస్యలు విస్మరించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులు ఎదుర్కొంటున్న దుర్భిక్ష సమస్యలు, కొనసాగుతున్న ఆత్మహత్యలకు ఉన్న కారణాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదు. రుణమాఫీ అమలుచేస్తున్న తీరు రైతు రుణ కష్టాలను పెంచుతుందే తప్ప ఏమాత్రం తగ్గించడం లేదు. ప్రభుత్వం దఫదఫలుగా రైతుల బాకీలను బ్యాంకులకు చెల్లిస్తుండటంతో వచ్చే సంవత్సరం కూడా మరో నాలుగో వంతు రుణాన్ని మాత్రమే ఇస్తామని ఇటీవల శాసనసభలో గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతుల బాకీలను పూర్తిగా చెల్లించి కనీసం సంస్థాగత రుణ భారం నుండి రైతులను విముక్తి చేయాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళన కరం. వరుసగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో కరవు పరిస్థితులను సృష్టించాయి. కరవు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలు ఏమాత్రం సరిపోవు. రాయితీతో సరఫరా చేశామంటున్న వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, ఫౌలీ హౌస్‌లు సామాన్య రైతులను ఊరిస్తున్నాయే తప్ప కనుచూపుమేరలో ఎక్కడా అందడం లేదు. చిన్నకమతాల రైతులకు ఉపయోగపడే పనిముట్లు కోరిన వారందరికీ రాయితీతో సరఫరా చేయాలనే డిమాండ్‌ను పాలకులు పట్టించుకోవడం లేదు. సాగు సమస్యలను పరిష్కరించడానికి వారి ఆదాయాలను పెంచడానికి తగిన చర్యలను తీసుకోవడానికి వీలుగా సాధికార వ్యవసాయ కమిషన్ అవసరాన్ని ప్రభుత్వం పట్టించుకున్నట్టు అనిపించడం లేదు.

-డా. ఎస్. మల్లారెడ్డి, తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షుడు