ఫోకస్

అనాలోచిత చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో కరవు తాండవిస్తోంది. నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అనాలోచితమైనవి. ప్రభుత్వాలు ఏవైనా సందర్భాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మండుటెండలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, గుక్కెడు నీరు దొరకక పల్లెజనం విలవిల్లాడుతుంటే ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టడం ప్రజల సొమ్ము వృథా చేయడమే. వర్షాలే లేవు.. ఇంకుడు గుంతలు దేనికోసమో? వర్షాకాలంలో నీరు వృథా పోకుండా స్టోరేజి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నీరు విలువైనది, నీటిని పొదుపుగా వాడుకోవాలి. చెరువుల్లో పూడికతీత, ఇంకుడు గుంతల తవ్వకాలు ఇప్పుడు అసందర్భం. ప్రస్తుతం కావలసింది వ్యవసాయానికి కరెంట్, పశువులకు దాణ, పేదలకు అందుబాటులో ఉండేవిధంగా నిత్యావసర సరుకులు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వాలు అసలు వర్షాలు లేకపోతే ఎలా? ప్రత్యామ్నాయం ఏమిటి? వ్యవసాయరంగం భవిష్యత్ ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించడం లేదు. ఇదే విదేశాల్లోనైతే నీటిని సముద్రాల నుంచి నగరాలకు తరలిస్తారు. ఫిల్టర్ చేసి తాగుకు, సాగుకు వినియోగిస్తారు. అలాంటి అవకాశం మనకు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నీటిని ఎందుకు వినియోగించుకోవు? ప్రాజెక్టులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు.. లిఫ్ట్‌లద్వారా సముద్రాలనుంచి నీటిని రప్పించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నీరులేక కుంటుపడుతున్న వ్యవసాయానికి ప్రత్యామ్నాయ పంటలపై ఎందుకు దృష్టి సారించరు.. రైతులకు సరైన మార్గదర్శకాలను ఎందుకు నిర్దేశించరు? ఇవి మనల్ని వెంటాడుతున్న ప్రశ్నలు. బీరు పరిశ్రమలకు నీరందించడంపై చూపుతున్న శ్రద్ధ ప్రజల గొంతు తడపడంలో లేదు. కరువు నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న పల్లెజనానికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. పనికి ఆహారం పథకమే కాదు.. ప్రతి పౌరుడికి ఉపాధి, ప్రతి రైతుకు సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు వంటి వాటిని అందించాలి. ముఖ్యంగా సాగునీటిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు అటుంచి ప్రస్తుతం వ్యవసాయ రంగానికి కావలసిన విద్యుత్, నీరును అందించే మార్గం అనే్వషించాలి.

-జగన్‌మోహన్ మెట్ల, లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి