ఫోకస్

గ్రామీణ విద్యార్థులకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్ర ఏ రాష్ట్రం అయినా నీట్ వల్ల గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుంది. దేశ వ్యాప్తంగా మెడికల్ ఎంట్రెన్స్ ఒకటే నిర్వహించాలనే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఇది అర్బన్ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. అర్బన్ ప్రాంతాల్లో, కాస్త సంపన్న కుటుంబాల పిల్లలు సెంట్రల్ సిలబస్‌లో చదువుతున్నారు. రాష్ట్ర సిలబస్‌లో చదువుకొని నీట్‌కు సిద్ధం కావడం అంటే కష్టం. మరో ప్రధాన సమస్య ఏమిటంటే- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఆర్టికల్ 371డి అమలులో ఉంది. నీట్‌లో అన్ని రాష్ట్రాల వారికి మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వాలంటే 371డి ఉత్తర్వులను సవరించాలి. 371డి ప్రకారం 85 శాతం సీట్లు ఈ ప్రాంతం వారికే ఉంటాయి. మిగిలిన 15 శాతంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వారికి లభిస్తాయి. నీట్‌వల్ల ఇది సాధ్యం కాదు. నీట్‌ద్వారా దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో మనవారికి సీట్లు లభిస్తాయి. అదే సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల వారికి మన రాష్ట్రంలో సీట్లు లభిస్తాయి. 371డి అమలులో ఉన్నందున మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల వారికి సీట్లు ఎలా ఇస్తారు? ఈ సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకునే నీట్‌ను తక్షణం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడాదిపాటు విద్యార్థులు దీనికోసం చదువుకుని సిద్ధమయ్యారు. ఇప్పటికిప్పుడు నీట్‌ద్వారా పరీక్షలు అంటే కొత్త సిలబస్‌ను చదువుకునేంత సమయం విద్యార్థులకు లేదు. ఊహించని విధంగా వచ్చిన నిర్ణయంవల్ల విద్యార్థుల్లో ఆయోమయం నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం యధావిధిగా ఎంసెట్ నిర్వాహణకు ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీల ఆందోళన వల్ల రెండు వారాలపాటు ఎంసెట్ వాయిదా వేసినా 15వ తేదీన ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారానే ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ