ఫోకస్

మంచిదే.. గడువు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అన్ని వైద్య కళాశాల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి పరీక్ష నీట్‌ను నిర్వహించాలనుకునే ఆలోచన మంచిదే కాని, రాష్ట్రాలకు గడువు ఇవ్వాలి. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు దెబ్బతింటారు. నీట్‌కు కామన్‌గా సిలబస్‌ను ప్రకటించాలి. దానికి అనుగుణంగా పరీక్షను నిర్వహించాలి. ప్రస్తుతం సిబిఎస్‌ఇ, స్టేట్ సిలబస్ ఇలా వేర్వేరు సిలబస్‌లు ఉన్నాయి. దీనివల్ల సిబిఎస్‌ఇ యేతర సిలబస్ చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. నీట్‌ను నిర్వహించాలనే తపన, ఆత్రుతలో సాధారణ విద్యార్థులకు నష్టం కలిగితే ఎవరు భర్తీ చేస్తారు. ఇప్పుడు వైద్యకళాశాలలో సీటు కావాలనుకునేవారు జిప్మర్, ఎయిమ్స్, సిఎంసి రాయవెల్లూరు, ఎఎఫ్‌ఎంసికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు వత్తిడికి గురవుతున్నారు. ఆర్థికంగా వ్యయ భారం ఎక్కువ. అలాగే బాగా ప్రతిభ ఉన్న విద్యార్థులు జాతీయ వైద్య సంస్థల్లో చదివే అవకాశం ఉంటుంది. కాని ఈ ఏడాది, ఇప్పుడే పరీక్షను నిర్వహించాలన్న కోర్టు తీర్పువల్ల ప్రాంతీయ మీడియంలో చదివిన, గ్రామీణ విద్యార్థులకు నష్టం ఎక్కువ. కనీసం ఒక ఏడాది గడువు ఇవ్వాలి. సిలబస్‌ను ముందుగా చెప్పాలి. అప్పుడు విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, ఉర్దూ, మలయాళం ప్రాంతీయ భాషల్లో కూడా నీట్ పరీక్షను నిర్వహించాలి. లేనిపక్షంలో హిందీ మీడియంకు చెందిన విద్యార్థులు సీట్లు తన్నుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రాంతీయ విభేదాలు పెరుగుతాయి. నీట్ పరీక్ష లక్ష్యం నీరుకారుతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు 371డి అధికరణ రక్షణ కవచం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయస్ధానాలు, మానవ వనరుల మంత్రిత్వ శాఖ తదుపరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏడు వేల సీట్లు రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయనే ప్రచారం బాగుంది. కాని గ్రామీణ విద్యార్థులకు ఆ సీట్లు లభిస్తాయా? విద్యార్థులకు ఉపయోగం కలిగే విధంగా న్యాయస్థానం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి.

- ఎస్ సలాం బాబు అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం