ఫోకస్

గందరగోళానికి రాష్ట్రానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ విషయంలో ఇంత గందరగోళం నెలకొనడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. లోగడ ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఆదివారం ‘నీట్’ జరిగినా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్‌లో పరీక్ష జరగలేదు. ‘నీట్’కు హాజరుకావాలా? లేదా? అసలు నిర్వహిస్తారా? లేదా? అనే గందరగోళంతో విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ప్రతిపక్షాల నుంచి తమ పార్టీలోకి వలస తెచ్చుకోవడంపై ఉన్నంత శ్రద్ధ విద్యార్థులపై, పరిపుష్టమైన విద్యా విధానంపై లేదు. ‘నీట్’ వంటి వాటిపై ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకునే ఆలోచన చేయడం లేదు. ‘నీట్’ నిర్వహించడం వల్ల మన రాష్ట్రం నుంచి 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంటుంది. మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చాలా తెలివైన వారున్నారు. ఐఐటి వంటి జాతీయ పరీక్షల్లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ముందు వరుసలో ఉంటున్నారు. ‘నీట్’కు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇంటర్ పాసైన విద్యార్థులు ఉన్నపళంగా ‘నీట్’కు హాజరుకావాలంటే చాలా కష్టం. ‘నీట్’ ఎప్పటి నుంచి ఆరంభించాలంటే, ఉదాహరణకు ఇప్పుడు పదవ తరగతి పాసై, ఈ విద్యా సంవత్సరం (2016-17)లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం (2017-18) కూడా పాసైన తర్వాత నుంచి ప్రారంభిస్తే అర్థం ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో చేరిన విద్యార్థులకు వచ్చే రెండేళ్ళ తర్వాత ‘నీట్’కు హాజరు అయ్యేలా చూడాలి. ఆ విధమైన నిబంధనలు రూపొందించాలి. ఇప్పుడు ఇంటర్‌లో చేరే విద్యార్థులకు రెండేళ్ళ తర్వాత ‘నీట్’కు హాజరు అయ్యేలా చర్యలు తీసుకుంటే, ఇక మీదట ఆ విధానమే కొనసాగుతుంది. కానీ ఉన్నపళంగా ‘నీట్’కు హాజరుకావాలంటే కోచింగ్ సెంటర్లకు మేలు జరుగుతుంది. కోచింగ్ సెంటర్లు ఫంక్షన్ హాళ్ళలో వందలు, వేల సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తుంటాయి. దీని వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులకు మానసిక వత్తిడి తప్ప. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

- చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే, టి. కాంగ్రెస్ నాయకుడు