ఫోకస్

ఎమ్సెట్‌నే నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల భారత మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. చాలాఏళ్లుగా విద్యార్థులు ఎమ్సెట్‌కు సన్నద్ధం అవుతున్న ఈ తరుణంలో అకస్మాత్తుగా ‘నీట్’కు విద్యార్థులు మానసికంగా సన్నద్ధం కాలేరు. ఎమ్సెట్ మూడ్‌లోనే విద్యార్థులున్నారు. జాతీయ ప్రవేశపరీక్ష ప్యాటర్న్‌కు సిద్ధం అయ్యే సమయం కూడా విద్యార్థులకు లేనందున వారంతా మనోవేదనకు గురవుతున్నారు. కనుక విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎమ్సెట్‌ను ఈ ఏడాది రాష్ట్రప్రభుత్వం నిర్వహించడమే మంచిది. అదే విధంగా రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఆర్టికల్‌ను రద్దు చేసేవిధంగా చట్టసభల్లో తీర్మానం చేసి నీట్‌లో చేరాలి.

- అయ్యప్ప, తెలంగాణ కార్యదర్శి, ఎబివిపి