ఫోకస్

జీవితాలతో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ పరీక్షతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఉన్నఫళంగా ‘నీట్’కు హాజరుకావాలంటే, అది విద్యార్థులకు సాధ్యమయ్యే పనేనా? ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా సిలబస్ ఉంటుంది. అటువంటప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ను విద్యార్థులు ఎలా తట్టుకోగలుగుతారు? కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాల సిలబస్‌ను అధ్యయనం చేసుంటే బాగుండేది. ఆయా రాష్ట్రాల సిలబస్ ప్రకారం విద్యార్థులు చదువుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఒకేసారి జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’కు హాజరు కావాలంటే విద్యార్థులకు శక్తికి మించిన పనే అవుతుంది. విద్యార్థులు నష్టపోతారు. సిబిఎస్‌ఇ సిలబస్ వేరు, రాష్ట్రాల్లో ఉండే సిలబస్ వేరు.
జాతీయ స్థాయిలో పర్సంటైల్ అని తీస్తున్నారు. ఒక్కో యూనివర్సిటీలో ఒక రకంగా విధానం ఉన్నది. ఆయా రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు కూడా సిలబస్ ఆధారంగా ప్రశ్నాపత్రం రూపొందించడం జరుగుతున్నది. కానీ ‘నీట్’లో జాతీయ స్థాయిలో ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. రాష్ట్రాల్లో ఉన్న సిలబస్ ప్రకారం చదువుకున్న విద్యార్థి, అకస్మాత్తుగా జాతీయ స్థాయిలో ఉండే ప్రశ్నాపత్రాన్ని రాయలేరు. 15 రోజుల్లో చదువుకుని పరీక్షకు హాజరు కావడం అంటే చాలా కష్టం.
ఉదాహరణకు ఎంసెట్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లు ఆయా రాష్ట్రాలు విడిగా నిర్వహించుకుంటున్నాయి. మెడికల్ ఎంట్రెన్స్ 1975 నుంచి ఉంది. ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఎంసెట్‌కు అనుగుణంగా ఆ పరీక్ష ఉంటుంది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఉన్నఫళంగా ‘నీట్’కు హాజరుకాలేరు. అయితే పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, సిబిఎస్‌సి (10+2 చదివిన) విద్యార్థులకు ఇబ్బంది ఉండదు.
రాజ్యాంగంలోని 371డి ఆర్టికల్‌ను తొలగించలేదు. లోగడ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. 50 శాతం మెడికల్ సీట్లు జాతీయ స్థాయిలో (నేషనల్ పూల్)కి ఇచ్చినట్లయితే, తెలుగు విద్యార్థులకు కూడా అవకాశం లభిస్తుందని కేంద్రం ప్రతిపాదించింది. దీనిని ఎన్టీఆర్, వైఎస్ వ్యతిరేకించారు.
371-డి ప్రకారం నేషనల్ ఇనిస్టిట్యూట్లు అయితేనే 50 శాతం సీట్లు (నిట్, ట్రిబుల్-ఐటి) ఇవ్వగలగుతున్నాయి. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు స్థానిక కాలేజీలు కాబట్టి 85 శాతం సీట్లు స్థానికులకే వర్తిస్తాయి. 15 శాతం ఓపెన్ కోటాలో బయటినుంచి విద్యార్థులు వచ్చినట్లయితే ఆ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా కొత్త లాభం ఏమిటీ? నీట్ పెట్టాలనుకుంటే ఇప్పుడు 2018 నుంచి అమలు చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు అప్పటివరకు ‘నీట్’ను దృష్టిలో పెట్టుకుని చదువుకుంటారు. అందుకే ఇప్పడు అమలు చేయకుండా 2018 నుంచి అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం తొందరపడకుండా తెలుగు విద్యార్థులకు నష్టం చేయవద్దని కోరుతున్నాం.

- ఎస్. ప్రకాశ్ రెడ్డి తెలంగాణ బిజెపి కార్యదర్శి