ఫోకస్

ప్రజాస్వామ్యంలో ఉన్నామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందులో తప్పేమిటో నాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు. దేశంలో ఎక్కడా బీఫ్ మాంసం అమ్మడం లేదా? బీఫ్ మాంసాన్ని విక్రయించరాదన్న ఆంక్షలేమైనా ఉన్నాయా? లేక తినరాదన్న ఆంక్షలేమైనా ఉన్నాయా? ఆ విధమైన చట్టాలు ఏమైనా కొత్తగా వచ్చాయేమో నాకైతే తెలియదు. యూనివర్సిటీలో విద్యార్థులు కొందరు బీఫ్ ఫెస్టివల్ చేసుకుంటామంటే దానిని భూతద్దంలో చూపిస్తూ, హిందు-ముస్లింల తగాదాలా చూపించే ప్రయత్నం జరగడం దురదృష్టకరం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఏదైనా తినవచ్చు... అంటే జాతీయ పక్షులను కాదు సుమా. ఇక వివాదం ఎందుకో అర్థం కావడం లేదు. బీఫ్ ఫెస్టివల్ చేసుకుంటామని విద్యార్థులు ప్రకటిస్తే, ఆ ఫెస్టివల్ జరుపుకుంటే తల్వార్లతో దాడి చేస్తామని బిజెపి నాయకుడు ఒకరు గట్టిగా హెచ్చరించారు. ఏదైనా దాడికి కుట్ర చేసినట్లు రుజువైనా, దాడి చేస్తామని హెచ్చరించినా పోలీసులు కేసులు పెడుతుంటారు కదా? అటువంటప్పుడు తల్వార్లతో దాడి చేస్తామని హెచ్చరించిన సదరు బిజెపి నాయకునిపై పోలీసులు ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు? ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఎలాంటి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాల్సిందిగా నగర పోలీసు కమిషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను అడుగుతాను. అంతేకాదు నీతులు వల్లించే బిజెపి అగ్రనాయకత్వం కూడా ఇంతవరకు స్పందించలేదు. సమానత్వం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ దీనికి ఏమని సమాధానం చెబుతారు? బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హింస ప్రజ్వరిల్లింది. అందుకే అనేకమంది సీనియర్ రచయితలు హింసకు వ్యతిరేకంగా తమకు లోగడ లభించిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. అప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. పైగా అసహనం వ్యక్తం చేసిన వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని చెప్పడం సరైంది కాదు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజలకు ఆశలు సన్నగిల్లాయి. అందుకే ఢిల్లీ రాష్ట్ర శాసనసభకు, తాజాగా బిహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. అంతేకాదు మోదీ సొంత జిల్లాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి వీచింది. దీనినిబట్టి ప్రజలకు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లిందని స్పష్టమైంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశీ పర్యటనలకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప దేశ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోలేదు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు పట్టం కట్టినందుకు దేశ ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారు.

- వి. హనుమంత రావు రాజ్యసభ సభ్యుడు,ఎఐసిసి కార్యదర్శి