ఫోకస్

ఎవరికి వారే బెటర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి కేంద్రం జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహంచే కన్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్టమ్రే నిర్వహించుకుంటే మంచిది. ఈ విషయంలో కేంద్రీకరణ అంటే కష్టం. కేంద్రప్రభుత్వం తన ఆధీనంలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలనుకోవడం మంచిది కాదు. ఇప్పుడు నీట్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతుందంటే కేంద్రం దేశం మొత్తం మీద వైద్య విద్యను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూడ్డమే అవుతుంది. గతంలో రాష్ట్ర జాబితాలో ఉన్న విద్య అంశం, తర్వాత ఉమ్మడి జాబితాలోకి వెళ్లింది. చట్టప్రకారం ఎలాగున్నా, ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలగకుండా వికేంద్రీకరణ జరిగితే మంచిది. ఎవరి పరీక్షలు వారు నిర్వహించుకుంటే, ఆ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సీట్ల భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో విద్యావకాశాలు ఒకరకంగా లేవు. కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినవి అయితే, మరికొన్ని రాష్ట్రాల్లో విద్య పూర్తిగా వెనుకబడి ఉన్నట్లు ఉంది. ఇలాంటి పరిస్థితిలో కేంద్రమే సిలబస్ తయారుచేసి పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యలో వెనుకబడిన రాష్ట్రాలు వాటిని స్వీకరించడమంటే కష్టం. అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉదాహరణకు నాగాలాండ్, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో అక్కడ స్థానిక పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా సిలబస్, పరీక్షల నిర్వహణ, విద్యా క్యాలెండర్ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలే ప్రవేశపరీక్షలు నిర్వహించుకుంటే ఆ పరిస్థితుల ప్రకారం నడుచుకున్నట్లు అవుతుంది. సుప్రీంకోర్టు జాతీయస్థాయిలో ఒకే పరీక్షకు మొగ్గు చూపడానికి కారణం ఉంది. అవకతవకలు నివారించేందుకు, ఒకే పరీక్ష ద్వారా ప్రమాణాలను పెంచేందుకు దోహదపడుతుందని భావించి ఉండవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్రాల పరిస్థితిని కూడా ఉన్నత న్యాయస్థానం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యుజిసి పరీక్షకు ఒక కరిక్యులమ్ తయారు చేస్తే అది నాగాలాండ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్‌కు సరిపోక పోవచ్చును. రాష్ట్రాల మధ్య వైవిధ్యం ఉంటుంది, ఆ ప్రకారం వారే పరీక్షలు నిర్వహించుకుంటే అన్నివిధాల మంచిది. జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలపై విస్తృత చర్చ జరగాలి. అప్పుడే అన్ని వర్గాల నుంచి వచ్చే అభిప్రాయం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. గతంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా అది కేంద్రం నిర్వహించడం ద్వారా కేంద్రీకృతమవుతుంది తప్ప ఆచరణలో రాష్ట్రాలకు ఒనగూరేది ఏదీ లేదని నా అభిప్రాయం.

- ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక విశే్లషకులు