ఫోకస్

నీట్‌లో చేరడమే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య విద్య చాలా సంక్లిష్టమైంది. ఎంతో నైపుణ్యం, సామర్థ్యం, కౌశలం ఉన్న వైద్యుల అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైద్య విద్యను అభ్యసించేవారు శక్తి సామర్థ్యాలతోపాటు జ్ఞాన సంపన్నులై ఉండాలి. మన దేశంలో పదేళ్లు సెకండరీ విద్య, రెండేళ్లు ఇంటర్మీడియట్ ముగిస్తే వెంటనే వైద్య విద్యను అభ్యసించేవీలుంది. ఇతర దేశాల్లో వైద్య విద్యకు 20 ఏళ్లు పడుతుంది. 12 సంవత్సరాలు హైస్కూల్ ఎడ్యుకేషన్, నాలుగేళ్ల బిఎస్సీ, రెండేళ్లు రెసిడెన్సి చేసి మరో రెండేళ్లు చేస్తేనే మెడికల్ చదువు అయినట్టు లెక్క. నిజానికి కోర్ సబ్జెక్టుల్లో కాంపిటెన్సీ చాలాముఖ్యం. కేవలం ఇంటర్ పుస్తకాలు చదువుకుని మన వాళ్లు మెడికల్ ఎడ్యుకేషన్‌కు వస్తున్నారు. నీట్ వంటి సమరూప జాతీయ పరీక్షవల్ల జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు కాలేజీల్లో చేరే వీలున్నందువల్ల కాలేజీల్లో సౌకర్యాల మెరుగుదలపై ఒత్తిడి ఉంటుంది. కనీసం 15 శాతం సీట్లు అయినా జాతీయ స్థాయిలో భర్తీ చేయడం చాలా మంచిది. మన మెడికల్ కాలేజీలు మణిపాల్, ఎయిమ్స్, సిఎంసి వంటి కాలేజీలు ఇతర దేశాల్లోని కాలేజీలతో పోల్చదగిన స్థాయిలో ఉన్నాయి. నీట్‌ను ఉపయోగించుకోకపోవడం మంచిది కాదు, మన రాష్ట్రాల్లోని ప్రమాణాలను అన్ని విధాలా పెంచుకోవాలనే ఆలోచన ఉంటే నీట్ ఎంతో దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులున్నారు. కాని సీట్లు తక్కువ ఉన్నాయి. నీట్ ఉపయోగించుకుంటే జాతీయ స్థాయిలో ఎక్కువ సీట్లు పొందే వీలుంది. ప్రమాణాలను స్థానికత పేరుతో అణచివేస్తున్నాం. స్థానికత కొంత మేరకు ఉపయోగపడుతుంది కాని ప్రమాణాలకు దోహదం చేయదు, ప్రమాణాలు రావాలంటే ఎంత విస్తృతంగా ఉంటే అంత ఉపయోగపడుతుంది. ఉస్మానియా యూనివర్శిటీలో చాలా విభాగాల్లో ఫ్యాకల్టీ ఒకటి రెండు ఏళ్లు పనిచేయడానికి బయటినుండి వచ్చేవారు, వారివల్ల స్థానికంగా ఉన్న వారిలో ఎంతో ప్రేరణ ఉండేది. చాలా ప్రతిభ ఉన్నవారు వచ్చేవారు. 50 శాతం వరకూ సీట్లు స్థానికులకు ఇచ్చి, మిగిలిన 50 శాతం బయటివారికి అవకాశం ఇస్తే మంచిది. వాస్తవానికి నీట్ నిర్వహించే ప్రయత్నం రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇంటర్మీడియట్‌లో స్టేట్ సిలబస్‌ను ఇప్పటికే సిబిఎస్‌ఇ సిలబస్‌తో ఇంటిగ్రేట్ చేశారు. సిలబస్‌ను జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం జరగలేదని అనుకోవడానికి లేదు, మన స్టేట్ వారికి ఇబ్బంది లేదు, ఐఐటి జెఇఇ పరీక్షలు రాయడం లేదా, మంచి జాతీయ ర్యాంకులు సాధించడం లేదా. మన సిలబస్‌లో చదివి జాతీయ ర్యాంకులను సాధిస్తున్నారు కదా!

- డాక్టర్ చుక్కా రామయ్య, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ