ఫోకస్

పాఠశాల నుంచే నీతిశాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాగరిక సమాజంలో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది. సమిష్టి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ ఆందోళన కలిగించే అంశాలు. ఏ పని చేసినా కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం లేదు. పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. వృద్ధులైన తల్లిదండ్రులను అనాథ శరణాలయంలో, వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. కొన్ని కుటుంబాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. చేతికి వచ్చిన పిల్లలు విదేశాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి జీవనం చేసుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ సొంత ఊరు, పట్టణాల్లోనే ఉండిపోతున్నారు. వారికి అనారోగ్యం కలిగితే చూసుకునేవారు లేరు. భార్యాభర్తలే ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. భార్య లేదా భర్త మరణిస్తే, వారి పిల్లలు అంత్యక్రియలకు హాజరై ఆ వెంటనే వెనుదిరుగుతున్నారు. ఆ తర్వాత ఉన్న ఒక్కరూ ఒంటరి జీవితం గడపాల్సి వస్తున్నది. అటువంటి వారిపట్ల పిల్లలు (కొందరు) నిర్దయగా ఉంటున్నారు. ఇది ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నది. ఇప్పుడిప్పుడే గ్రామాలకూ విస్తరిస్తున్నది. ఈ విధానంలో మార్పు రావాలంటే పాఠశాల విద్యనుంచే ‘నీతిశాస్త్రం’ తప్పనిసరిగా ఉండాలి. తద్వారా కుటుంబ వ్యవస్థ, పెద్దలంటే గౌరవభావం ఏర్పడుతుంది. గతంలో నీతిశాస్త్రం ఉండేది. నీతిశాస్త్రాన్ని పునరుద్ధరించాలి. మన విద్యా విధానంలో విద్యార్థిని వ్యక్తిత్వం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలపట్ల గౌరవ భావం, నీతి, దేశభక్తి, సమాజం అంశాలపై దృష్టి సారించడం లేదు. విద్యార్థిని ఒక ప్రాడక్ట్‌గానే తయారు చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంపై, విద్యార్థులపై పాశ్చాత్య నాగరికత ఆధిపత్యం కొనసాగుతోంది. కారణమేమిటంటే... నిత్యం కొన్ని టివీల్లో వస్తున్న సీరియళ్ళు కుటుంబ వ్యవస్థను దెబ్బతీసేలా ఉంటున్నాయి. అత్తా-కోడళ్ళ మధ్య రాజకీయాలు లేదా తోటికోడళ్ళ మధ్య రాజకీయాలు, ప్రియునితో కలిసి భర్తను చంపించేందుకు రోడ్డు ప్రమాదం చేయించడం వంటి ఘటనలు చూపించి సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. కొన్ని సినిమాలూ అదే విధంగా ఉంటున్నాయి. నీతి, నిజాయితీ అనేవి సినిమాలు, సీరియళ్ళలో కొరవడ్డాయి.
ఇక యువత విషయానికి వస్తే మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మత్తు పదార్థాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. దీంతో వారి మెదడుపై ప్రభావం పడి, విచక్షణ కోల్పోయి అత్యాచారాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు మరుస్తున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు, ప్రపంచంలో గొప్పదైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

- మంగిని అరుణ జ్యోతి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ‘మార్గదర్శిని’ ఎన్జీవో వ్యవస్థాపకురాలు