ఫోకస్

సమాజ హితం వైపు మళ్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, సామాజిక వ్యవస్థ సాఫీగా సాగాలన్నా, దేశం అన్ని రంగాల్లో పురోగమించాలన్నా యువత ప్రధానమైన చోదకశక్తిగా నిలుస్తుంది. మన దేశంలో అపారమైన యువశక్తి ఉంది. అది సురక్షితమైన భావి భారతానికి భరోసా. చేతికందివచ్చిన పిలల్లను చూసి తల్లిదండ్రులు ఏ విధంగా నిశ్చితంగా ఉంటారో, దేశం కూడా యువశక్తిని చూసి నిశ్చితంగా ఉండవచ్చు. యువశక్తి ఈ దేశ భవిష్యత్తుకు ఇన్సూరెన్స్ లాంటిది.
ఈ కాలంలో ఉన్న యువతీయువకుల సమర్థత ఎంత? వారిలో దేశభక్తి ఎంత, ఇంతటి బాధ్యత మోసే పరిపక్వత వారిలో ఉందా? అంటే ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. యువకులు అనే సరికి చాలామంది మనసులో ఒక అభిప్రాయం ముద్రించుకుని ఉంటుంది. నేటి యువతకు బాధ్యతలు తెలియవు, దుబారా చేస్తారు, పెద్దలంటే గౌరవం ఇవ్వరు, తమ అవసరాలు తీరితే చాలు అనుకుంటారు, ఏదీ సీరియస్‌గా తీసుకోరు, ఇంట్లో తల్లి కష్టపడుతున్నా పట్టించుకోరు, స్నేహితులు, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ ఇదే వారి ప్రపంచం అనే అభిప్రాయం ఉంది. తండ్రి అంటే ఒక ఎటిఎం మిషన్, తల్లి అంటే తనకు కావలసినవి వండిపెట్టే కుక్ అనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. ఇది పాక్షిక సత్యమే. చాలామంది తల్లిదండ్రులు తమ ఆలోచనలు, తమ ఇష్టాఇష్టాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం వల్ల జనరేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ‘ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్యు’ అని మానసిక శాస్తవ్రేత్త అన్నట్టు అతనిలో దాగివున్న నైపుణ్యాన్ని గుర్తుపట్టి ఆ రంగంలో ప్రోత్సహిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమాజంలో ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఐటి వృత్తిలో ఉన్నవారు మాత్రమే బతకగలుగుతాడు అనే భ్రాంతినుంచి తల్లిదండ్రులు బయటపడాలి. ప్రతిరోజూ రాజకీయాలను తిట్టిపోసే తండ్రి తన కుమారుడిని మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంచుతాడు. మంచివాళ్లు వస్తేనే మంచి రాజకీయాలు ఉంటాయి. తన పిల్లలు నటుడు, మంచి కళాకారుడు, గొప్ప ఆటగాడు కావాలని తల్లి దండ్రులు ఆశించడం లేదు. ఒకటి రెండు వృత్తులను ఎంచుకుని అవేతప్ప మరేవీ వృత్తులు కావని, అందులో ఉపాధి అవకాశాలు లేవని అనుకోవడం మంచిది కాదు. దీంతో తనకు నచ్చిన కోర్సు చేయలేక, ఇష్టం లేని రంగంలో రాణించలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. మన దేశంలో రెండు భాగాలున్నాయి. ఒకటి గ్రామీణ భారతం, రెండవది మెట్రో భారతం. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న యువత ఆలోచనల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. యువతలో సామాజిక చైతన్యానికి కొదవలేదు. దీనికి తెలంగాణ ఉద్యమమే సాక్ష్యం. యువతకు ఆవేశం ఉండడం సహజం. మేధావులు, బుద్ధి జీవులు వారి ఆవేశాన్ని సమాజ హితంవైపు మళ్లించాలి. వారి ఆవేశం ఉధృతమైన జలపాతం లాంటిది. దానికి ఆనకట్ట కట్టి సరిగా చానలైజ్ చేస్తే పచ్చని పంటలు పండుతాయి. లేదంటే ఉప్పెనగా మారి పంట భూములను మింగేస్తుంది. ఆవేశానికి అనుభవం తోడైతే అద్భుతాలు జరుగుతాయి.

- ముక్తవరం సుశీలారెడ్డి, టిఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి