ఫోకస్

అందరి దృష్టీ యువతపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ భవిష్యత్, జాతి భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా జనాభాకు సరిసమానంగా మన దేశంలో యువత ఉంది. దేశ జనాభాలో యువత అరవై శాతం పైగా ఉన్నారు. అంటే అద్భుతమైన మానవ వనరుల దేశం మనది. వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ, దేశ ప్రగతిలో భాగస్వామ్యులుగా చేస్తే ప్రపంచ దేశాలకు దీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చు. అయితే నేటి యువత తీరుపై అనేక విమర్శలూ, ఫిర్యాదులూ ఉన్నాయి. ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు... కొంతమంది యువకులు ముందు తరం దూతలు... పావన నవజీవన బృందావన నిర్మాతలు’ అన్నారు శ్రీశ్రీ. మన ముందున్న యువతలో అధిక శాతానికి మొదటి వాక్యం చక్కగా సరిపోతుంది. అన్వయించుకుంటే జవసత్వాలు ఉడిగిన వృద్ధులే కాదు, అన్ని రకాల అవలక్షణాలున్నట్టు తోస్తోంది. వ్యవస్థ భ్రస్టుపట్టిపోయింది. ఇపుడు ఎవరూ ఏమీ చేయలేరు అనే నిరాశావాదంతో మనం ఏమీ చేయలేమనే నిరుత్సాహం, నిస్పృహతో కొట్టుమిట్టాడుతోంది యువత. ఆధునిక విజ్ఞానం అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిసో తెలియకో తమ వినాశనానికి, సమాజ అధోగతికి ఉపయోగిస్తున్నారు. అసలు వ్యవస్థ అంటే ఎవరు...? మనమే... అంటే మనం మారితేనే వ్యవస్థ మారుతుంది. చీకటిలో కూర్చుని చీకటి... చీకటి అని తిట్టుకున్నా అరచినా, ఆ చీకటి పోతుందా? పోనే పోదు... ఎవరో ఒకరు దీపం వెలిగించాలి. వెలుతురు పూయించాలి, నేటి యువత ఆరోగ్యంకోసం జిమ్‌లకు, యోగా సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. తీసుకునే ఆహారం మీదమాత్రం శ్రద్ధ చూపడం లేదు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకూ తక్షశిల, నలంద, విక్రమశిల తదితర విశ్వవిద్యాలయాలకు విదేశాల నుండి వచ్చి చదువుకునేవారు. ప్రస్తుతం మన విద్యార్థులు చదువుకోసం విదేశాలకు వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో సమీక్షించుకోవాలి. ఒకపుడు సామాజిక స్పృహతో, చైతన్యంతో నడిచిన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నేడు పట్ట్భద్రులను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారాయి. కానీ విజ్ఞాన భాండాగారాలుగా లేవు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 15-34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువత ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ. కానీ మనదేశంలో యువతకి తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదు, యువతలో సృజనాత్మకత అంటే ఆధునికంగా కనిపించడమే, అలంకరించుకోవడం, ఆడంబరాలు ప్రదర్శించడం అనుకుంటారు కొందరు. సృజనాత్మకత అంటే విశాల దృక్పథంతో వికసించిన వ్యక్తిత్వాలతో సమాజ శ్రేయస్సుకోసం ఉపయోగపడే జీవనం కోసం కొత్తగా ఆలోచించడం, ప్రపంచాన్ని ముందుకు నడపడానికి అనే్వషలు చేయడం, మేథోమధనం చేయడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కృషి చేయడం, పరిశోధనా ఫలాలను సమాజానికి అందించడం. కాని నేటి యుతవ లైఫ్ అంటే సెలబ్రేషన్స్, క్లబ్‌లు, పబ్‌లు, సినిమాలు, షికార్లు, టీవీలు, ఇంటర్నెట్, సెల్‌ఫోన్లుతో కాలక్షేపంగా మారిపోయింది. ఏ కాస్తా టైం దొరికినా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఇది మారాలి.

- ప్రొఫెసర్ కె. యాదగిరి, మాజీ సంచాలకుడు, తెలుగు అకాడమి