ఫోకస్

అరాచకం సృష్టించే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలోని పారిశ్రామికవాడలో ఆ మధ్య తరుచుగా పిల్లలు మాయం అవుతుండడంతో పోలీసులు నిఘా పెడితే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి మనిషి మాంసాన్ని తినడానికి అలవాటుపడ్డాడు. నా ఇష్టం తిండిపై నా స్వేచ్ఛను అడ్డుకుంటారా? అని వాదించాడు. ఇప్పుడతను జైలులో ఉన్నాడు. అదే విధంగా కొందరు కోట్లాది మంది హిందువులను రెచ్చగొట్టేందుకు గో మాంసాన్ని విశ్వవిద్యాలయంలో తింటామని వివాదం సృష్టిస్తున్నారు. తిండి అనేది ఇంట్లో తినాలి. యూనివర్సిటీలో చదువుకోవాలి, చదువు విషయంలో పోటీ ఉండాలి కానీ ఆవు మాంసాన్ని తినడం ద్వారా అరాచకం సృష్టిస్తామనే ప్రయత్నం మంచిది కాదు. కోట్లాది మంది హిందువులను రెచ్చగొట్టాలనేదే వీరి కుట్ర. యూనివర్సిటీలో ఆవు మాంసం తింటాం అని వివాదం రేకెత్తించిన వారిలో ముస్లింలు లేరు. వారీ వివాదానికి దూరంగానే ఉన్నారు. వామపక్షాలవారు, హిందూ వ్యతిరేక శక్తులే ఈ కార్యక్రమంలో ఉన్నాయి. ముస్లిం దేశాల్లో పంది మాంసం తినడాన్ని నిషేధించారు. ఆవు మాంసం తినే ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతున్నవారు పంది మాంసం ఉత్సవాలెందుకు నిర్వహించడం లేదు. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. స్వేచ్ఛకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. విశ్వవిద్యాలయానికి వీరు చదువు కోవడానికి వస్తున్నారా? ఏదో ఒక పేరుతో అల్లరి చేసేందుకు వస్తున్నారా? అని ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను రెచ్చగొట్టి అరాచకం సృష్టించి ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రను సహించకూడదు. దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. న్యాయస్థానం నిర్ణయం సముచితంగా ఉంది. వామపక్షాలవారి ఇలాంటి చర్యలను సమాజం వ్యతిరేకించాలి. కొద్దిమంది చేరి కోట్లాది మంది మనోభావాలను దెబ్బతిసే విధంగా వ్యవహరించడాన్ని సహించరాదు. తినాల్సిన చోటు ఇళ్లు. చదువుకోవలసిన చోటు యూనివర్సిటీ - ఈ తేడాను తెలుసుకోవాలి. మీరు ఆవు మాంసం తింటాం ఇది మా స్వేచ్ఛ అంటే ఇంకొకరు మనిషి మాంసం తింటామంటారు. చదువులో పోటీ పడాలి, అంతే కానీ వామపక్షాల ప్రభావంలో పడి దేశంలో ఆరాచకం సృష్టించాలని ప్రయత్నించడం దేశానికి మంచిది కాదు.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి