ఫోకస్

యువత.. మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశంగా భారత్ ప్రపంచాన్ని శాసించనుంది. రానున్న రోజుల్లో యువత ఎక్కువగా ఉన్న దేశంగా చైనా, జపాన్, అమెరికా, బ్రిటన్‌లను కూడా దాటిపోనుంది. పనిసామర్థ్యం ఎక్కువగా ఉన్నవారు, మానసికంగా బలవంతులైన యువతీ యువకులు ఈ దేశాన్ని అగ్రగామి దేశంగా కూర్చోబెట్టే గొప్ప అవకాశం రాబోతోంది. ఇప్పటికే భారతీయులు ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుంటూ, గొప్ప విజయాలను ఆవిష్కరిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో మనవారి తెలివితేటల ముందు ఎవరైనా దిగదిడుపే. అంత శక్తివంతమైన యువత కూడా ఇటీవలి కాలంలో గందరగోళంలో చిక్కుకుంటోంది. మానవీయ విలువల సరిహద్దులను చెరిపేసుకుంటూ సామాజిక మాధ్యమాలు, అత్యాధునిక ఇంటర్‌నెట్ ఆధారిత వ్యవహారాల్లో తలమునకలై ఇబ్బంది పడుతోంది. వాటి ప్రభావంలో పడి మానసిక అడ్డుకట్టలను సైతం తుంచేసుకుని ఎక్కడికో అనే్వషిస్తోంది, ఈ క్రమంలో యువత తప్పుడు పనులకు దిగుతున్నారు. ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు, కోర్టులు, కేసులు అంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
మానవీయ విలువల దిగజారుడు వల్లే ఇలా జరుగుతుందని కొంతమంది అభిప్రాయం, విద్యావిధానంలో లోపం వల్లే ఇలా జరుగుతుందని మరికొందరి అభిప్రాయం, సమాజంలో సరైన వాతావరణం లేకపోవడం మరో కారణమని ఇంకొందరి భావన. ఏమైతేనేం మునుపెన్నడూ లేని విధంగా యువత చెడిపోతోందని అందరి ఆందోళన రోజురోజుకూ సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించాల్సి ఉందనేది వారి సూచన. సినిమాల ప్రభావమా? ఇంటర్‌నెట్ వంటి ఆధునిక మీడియా ప్రభావమా? టివి ప్రభావమా? ఏదైతేనేం మొత్తం మీద పదునైన కత్తి వంటి యువతపై దుష్ఫలితాలను చూపిస్తున్నాయి.
యువత మారదా? నేరాలు ఘోరాలలో యువత పాత్ర, ప్రమేయం ఎందుకు ఎక్కువ? సామాజిక చైతన్యం పట్టదా? బాధ్యత లేకపోవడమే కారణమా? కెరీర్ యోచన లేదా? స్ర్తిపురుష వివక్షను వీడి సమానత్వాన్ని అలవరచుకోలేదా? గాడి తప్పిన యువ మళ్లీ గాడిలో పడదా? ఈ వారం ఫోకస్ ఈ అంశంపైనే... నిపుణుల అభిప్రాయాలు మీ కోసం ....