ఫోకస్

మినహాయింపుకోసం ఆఖరిక్షణం వరకు ప్రయత్నిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని మెడిసిన్, బిడిఎస్ సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూలై 24న రెండో విడతగా జరగబోయే నీట్ పరీక్ష నుంచి ఏదోవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు కోసం ఆఖరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంది. ఈ మేరకు ఇప్పటికే అభ్యర్థనలు పంపాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ప్రధాని, కేంద్ర మంత్రులతో సంప్రదింపులు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎంసెట్ పరీక్ష ముగిసి ‘కీ’ కూడా వెల్లడించాం. వైద్యవృత్తి చేపట్టేందుకు ఉత్తమ ర్యాంకుల సాధన కోసం తెలుగు విద్యార్థులు ఆహోరాత్రులు శ్రమించారు. కొందరైతే రెండు, మూడేళ్లు లాంగ్‌టర్మ్ శిక్షణ పొందారు. మళ్లీ పోటీ పరీక్ష రాసే పరిస్థితుల్లో విద్యార్థులు లేరు. పోనీ ఈ రెండు మాసాలు కష్టపడతామంటే సిలబస్ మెటీరియల్ అందుబాటులో లేదు. ప్రాంతీయ భాషలో రాసుకోవచ్చంటున్నారు. తెలుగు అనువాదం ఎప్పటికి జరిగేను? అన్నింటికీ మించి ఈ సిలబస్‌ను బోధించే వారున్నారా అనే అనుమానం కలుగుతోంది. కేవలం మెడిసిన్, బిడిఎస్ కోర్సులతోనే ఎంసెట్ ముడిపడి లేదు. అగ్రికల్చరల్, నర్సింగ్, హోమియో, ఆయుర్వేదం, యునాని, వెటర్నరీ, అగ్రికల్చర్ బిఎస్సీ, నేచురోపతి.. ఇలా అనేక కోర్సులతో ముడిపడి ఉంది. వరుసగా ప్రాధాన్యత ప్రకారం తమ ర్యాంక్‌ను బట్టి ఏదో కోర్సులో చేరిపోవాలని ప్రతిఒక్కరూ ఉబలాటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు పోటీ పరీక్షలకు, అందునా నీట్‌లో 20 లక్షల మంది అభ్యర్థులతో పోటీపడటం అసాధ్యం. కనీసం ఈ ఒక్క ఏడాదికి ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వాలని కేంద్రంపై అన్నివిధాలా ఒత్తిడి తీసుకురానున్నాం.

- డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి