ఫోకస్

బీఫ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీఫ్ ఫెస్టివల్- పెద్దకూర పండుగ... మాంసాహారులైన ప్రజలు తమకు నచ్చిన మాంసాన్ని భుజించడం సహజం. కొంతమంది కోడి కూర, కొంతమంది గొర్రె మాంసం, మరికొంతమంది మేక మాంసం, ఇంకొంతమంది ఆవుమాంసం, పంది మాంసం ఇలా ఒకొక్కరూ తమ జీవన అలవాట్లకు అనుగుణంగా మాంసాన్ని భుజించడం చాలాకాలంగా జరుగుతోంది. అయితే అత్యంత ప్రాచీనమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆవు మాంసాన్ని, పంది మాంసాన్ని భుజించడం, దానిని ఒక భారీ ఉత్సవంగా నిర్వహించాలని చూడటంతో వివాదం రాజుకుంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని విద్యార్థి సంఘాలు, కూడదు తగదు అని ఇటు విశ్వవిద్యాలయ అధికారులు, న్యాయస్థానాలు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య రగడ మొదలైంది.
ఎలాగైనా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతామని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఆహారం తీసుకునే హక్కులను ఇటు కేంద్రం, అటు ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు కాలరాస్తున్నాయని కొంతమంది విద్యార్థులు అంటున్నారు. హిందువులు గోమాతను పూజిస్తారని, అటువంటి గోమాత మాంసాన్ని తినడం హేయమని విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలతోపాటు పలు హిందూ సంస్థలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే హిందూసంస్థలు అన్నీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి గోహత్యను నిషేధించాలని కోరాయి. గోమాంసం తిన్నాడనే ఆరోపణలతో అఖ్లక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురికావడం, ఆ వార్త దావానలంలా దేశం అంతా వ్యాపించి నిరసనలు పెద్దఎత్తున ప్రారంభం అయ్యాయి. దాంతో గోవధ నిషేధం అంశం దేశవ్యాప్తంగా మరోమారు విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గో హత్యను నిషేధించాలని నిరసన ప్రదర్శనలు చోటుచేసుకోగా, గోమాంసం తింటే తప్పేమిటని మరోవర్గం బయలుదేరింది. ఇదిలా ఉండగా, డిసెంబర్ 10న ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీ ప్రాంగణంలో బీఫ్ పెస్టివల్ -పెద్దకూర పండుగ చేసి తీరుతామని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక -డిసిఎం ప్రకటించింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల ఆహారపు అలవాట్లపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాము బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు డిసిఎం పేర్కొంది. కొన్ని కులాలు ఆధిపత్యాన్ని అదుపు చేసి ఉత్పత్తి చేసే కులాల సంస్కృతిని కాపాడటమే ఈ పండగ లక్ష్యమని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 10 వరకూ ఒక షెడ్యూలు ప్రకారం ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. డిసెంబర్ 1న కవి సమ్మేళనం, డిసెంబర్ 5న రాజకీయ పార్టీల ఐక్యవేదిక, డిసెంబర్ 7న 5కె రన్, డిసెంబర్ 10న బీఫ్ ఫెస్టివల్ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బీఫ్ తినేవాళ్లు దేశం విడిచి వెళ్లాలనే రీతిలో మాట్లాటడం వల్ల తాము ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని డిసిఎం చెప్పడంతో డిసెంబర్ 10న ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటాయో అనే ఆందోళన అందరిలో మొదలైంది. ఈ క్రమంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ జోక్యం చేసుకుని విశ్వవిద్యాలయంలో బీఫ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు తగవని, వైస్ ఛాన్సలర్ రంజీవ్ ఆర్ ఆచార్యను కోరారు. గోమాతను పూజించే దేశంలో ఈ తరహా ఉత్సవాలు ప్రజల్లో ఉద్రిక్తతకు దారితీస్తాయని ఎమ్మెల్యే విసికి వివరించారు. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్ ఫెస్టివల్ చేయాలని ఆలోచన చేయడం సరికాదని, 2012లో కూడా బీఫ్ ఫెస్టివల్ చేయాలని ప్రయత్నించారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వవద్దని ఉస్మానియా యూనివర్శిటీ విసిని కలిసి కోరినట్టు రాజాసింగ్ చెప్పారు. బీఫ్ ఫెస్టివల్‌ను ఎవరూ వ్యతిరేకించడం లేదని, విహెచ్‌పి , బిజెపి సైతం వ్యతిరేకించడం లేదని, రాజకీయ పార్టీలు సైతం ఆపాలని అనడం లేదని ఫోరం ఫర్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. పెద్ద నాయకులు సైతం బీఫ్‌ను తినొద్దని అనడం లేదని ఫెస్టివల్ నిర్వాహకులు సుదర్శన్, డేవిడ్ వాదిస్తున్నారు. దేశంలో 80 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని వారి ఆహారపు అలవాట్లను 20 శాతం మంది కోసం ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. బలహీన అట్టడుగు వర్గాలు మినహా ఇతరులు అంతా ఆర్యులేనని, వారంతా వలస వచ్చినవారేనని, ఆర్యులు సైతం పశువులను ఆహారంగా తీసుకునేవారనేది నిర్వాహకుల వాదన. యజ్ఞాల పేరుతో ఆవులను నరికివేయడాన్ని ఆపేందుకు బుద్ధుడు, జైనమహావీరుడు చర్యలు తీసుకున్నా, అశోకుడు సైతం ఆవు మాంసం తిన్నవాడేనని, వేదాలలో, హిందూ గ్రంథాలలో ఎక్కడా ఆవును తినకూడదని రాయలేదని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్