ఫోకస్

‘నీట్’ తప్పనిసరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు ప్రతి అభ్యర్ధి నీట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు . వచ్చే ఏడాది నుండి ఇది నూటికి నూరు శాతం అమలు కావడం ఖాయం. ఈ ఏడాది కొన్ని రాష్ట్రాలు మినహాయింపు కోరుతున్నాయి. ఈ మినహాయింపుపై ఇంకా స్పష్టత లేదు. నేడో రేపో ఈ అంశంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికే నీట్ -1 (ఎఐపిఎంటి) పూర్తయింది, మరో రెండు నెలల్లో నీట్-2 నిర్వహించనున్నారు. భారతదేశ విద్యా రంగాన్ని కుదిపేసిన ఘటన ఇది. 2012కు ముందు ప్రసిద్ధ ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు సొంత ప్రవేశపరీక్షలను నిర్వహించేవారు. దానిని ప్రశ్నిస్తూ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నీట్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు నీట్ మార్గదర్శకాలను జారీ చేసింది.
మొదటిసారి నీట్ నిర్వహించేలోగా పలు కాలేజీల యాజమాన్యాలు, రాష్ట్రాలు ఇది తమ అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడమేనని, కేంద్రానికి ఆ అధికారం లేదని, ఎంసిఐ తన పరిధి దాటి వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేశాయి. ఆ కేసులను విచారించిన సుప్రీంకోర్టు నీట్ పరీక్షను రద్దు చేస్తూ, ప్రైవేటు యాజమాన్యాలకు స్వేచ్ఛను ఇచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా ఓపెన్ కోటాలోని 15 శాతం సీట్లకు, ముందుకొచ్చిన చిన్న రాష్ట్రాల తరఫున కేంద్రం ఎఐపిఎంటి నిర్వహిస్తూ వచ్చింది. కేంద్రం తీరును, ప్రైవేటు యాజమాన్యాల తీరును ప్రశ్నిస్తూ విద్యార్థులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బెంచ్ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడమేగాక, ఈ ఏడాది నుండి నీట్‌ను నిర్బంధంగా అమలుచేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో వందలాది పిటిషన్లు సుప్రీంలో దాఖలైనా వాటన్నింటినీ తోసిపుచ్చింది. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం వివిధ రాష్ట్రాల సమస్యలను వినడానికి 16వ తేదీన ఒక సమావేశాన్ని నిర్వహించి నివేదికను రూపొందించి దానిని ప్రధానికి, మరోపక్క సుప్రీంకోర్టులో సమర్పణకు సొలిసిటర్ జనరల్‌కు సమర్పించింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. చాలా రాష్ట్రాలు తాము నీట్ పరీక్షకు వ్యతిరేకం కాదని, అయితే ఈ ఏడాది నుండే అమలుచేయమనడంపైనే అభ్యంతరం ఉందని చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఇప్పటికే ఎమ్సెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ స్ట్రీంల పరీక్షలు పూర్తయ్యాయి. ఆంధ్రాలో ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం ఫలితాలను కూడా ప్రకటించారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో సైతం ఎమ్సెట్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పరిస్థితుల్లో నీట్ రూపంలో విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం సరికాదని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో చేరేందుకు 172 ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి విద్యార్ధి కనీసం రెండు మూడు పరీక్షలకు హాజరవుతున్నారు. కొంతమంది విద్యార్థులు గరిష్ఠంగా పదివరకూ ఎంట్రన్స్‌లు రాస్తున్నారు. దీనివల్ల ధనం కాలం ఎంతో నష్టం అవుతోంది. ఇన్ని ప్రవేశపరీక్షలు రాసే బదులు ఒకే ప్రవేశపరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం ఏ విధంగా చూసినా విద్యార్థికి లాభమే. ఈ ఏడాది నీట్ తప్పనిసరి అయినా ఇప్పటికే ఎయిమ్స్, పూనే ఎఎఫ్‌ఎంసి, సిఎంసిలకు మినహాయింపు లభించింది. ఈ క్రమంలో నీట్ గందరగోళంపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.