ఫోకస్

మంచి రోజులు వచ్చాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో పేద ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని దేవుడు ఇచ్చిన వరంగా భావించడానికి ఇదే కారణమా? రకరకాల పేర్లతో నిర్వహించిన అనేక సర్వేలు బిజెపి పాలనకు ‘మంచి’ మార్కులు ఇచ్చాయి. సామాన్యుడి మొదలు ధనవంతుడి వరకూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఎన్నో ఈ ప్రభుత్వం చేపట్టింది. లెక్కలేనన్ని పథకాలు అమలులోకి తీసుకువచ్చింది. పొరుగుదేశాల్లో పరువునిలిపే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. దేశంలో అవగాహనా రాహిత్యంతో చేస్తున్న విమర్శలు మినహా మొత్తం మీద రెండేళ్లపాలనతో మోదీ పాలన మంచిమార్కులే కొట్టేసింది.
మోదీ పాలనతో ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రా ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనం పొందాయి. పునర్విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకూ న్యాయంచేసే ప్రయత్నం కూడా కేంద్రం చేసింది. ఆంధ్రాకు కొత్త జాతీయ విద్యాసంస్థలు, రాజధాని నిర్మాణానికి నిధులు, కేంద్ర జాతీయ పరిశోధనా సంస్థలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులకు అనుమతి, నిధుల కేటాయింపు ఇలా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి సైతం నిధుల లోటు భర్తీకి, నదీ జలాల వినియోగంలోనూ న్యాయం చేసింది. రాజకీయంగా ఇరు రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగేలా పరోక్షంగా బాసటగా నిలిచింది. దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బిజెపి తనవంతు మార్కును ప్రదర్శిస్తూనే పార్టీపరంగా విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇంతలా ఈ ప్రభుత్వం అందరికీ ఏం చేసింది? అని మార్పును కళ్లారా చూస్తున్నవారు సైతం ప్రశ్నిస్తున్నారు. అందుకు కేంద్రం సరైన సమాధానమే చెబుతోంది. రంగాలవారీగా వారు సాధించిన విజయాలను చెబుతోంది. మచ్చుకు ఆర్థికరంగం తీసుకుంటే భారత దేశ జిడిపిని ఐఎంఎఫ్ 7.5 శాతంగా అంచనా వేసింది. అదే ప్రపంచబ్యాంకు 7.8గా, ఎడిబి 7.4గా అంచనా వేసింది. ఇది గణనీయమైన ప్రగతి. అంతేకాదు, ద్రవ్యోల్బణం 11.16 శాతం (2013) నుండి 3.69 శాతానికి (2015) తగ్గింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 48 శాతం పెరిగాయి.
2015లో అత్యధికంగా విదేశీ ద్రవ్య (్ఫరెక్స్) నిల్వలు నమోదయ్యాయి. వ్యాపారం తేలికగా చేసుకునేలా చట్ట నిబంధనలను సరళతరం చేశారు. రియల్ ఎస్టేట్ బిల్లును, కార్మిక చట్టాల్లోనూ అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. పరిపాలనా సంస్కరణలు అయితే తొలిరోజునుంచే చేపడుతూనే ఉన్నారు. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మానిటరింగ్ సిస్టం చేపట్టారు. మై గవర్నమెంట్ పేరిట సుపరిపాలనా కార్యక్రమం, ప్రగతి కార్యక్రమం, బొగ్గు గనుల వేలంలో పారదర్శకత, టెలికం స్పెక్ట్రమ్ వేలంలో పారదర్శకత, నాన్‌గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేయడం, స్వీయ సర్ట్ఫికేషన్‌తో సర్వీసులో చేరడం, నల్లధనం వెలికి తీసుకువచ్చేందుకు ‘సిట్’ ఏర్పాటు, అవినీతి నిర్మూలన చట్టంలో మార్పులు, పని సంస్కృతిని అలవరచడం, ఆధార్ ఆధారిత హాజరు, రీజనల్ సాధికారిక కమిటీలు ఏర్పాటు, ఒక ర్యాంకుకు ఒకే పెన్షన్ విధానం అమలులోకి తెచ్చారు. వ్యవసాయ రంగం చూస్తే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రంగానికి రెట్టింపు నిధుల కేటాయింపు, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు స్కీం, ఇనామ్, డిజాస్టర్ రిలీఫ్ స్కీం, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, కిసాన్ టివి, జల్ క్రాంతి అభియాన్ పథకాలు, జన్‌ధన్ పథకం రైతులను తలెత్తుకునేలా చేశాయి. వౌలిక సదుపాయాల కల్పనకు, యువతకు, మైనార్టీలకు, మహిళలకు లెక్కలేనన్ని పథకాలను అమలుచేస్తున్నారు.
అలా అని దేశంలో సమస్యలు లేవని కాదు, అన్ని రంగాల్లో అనేక సమస్యలు తొంగి చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఇంకా చర్చ జరగాల్సి ఉంది... ప్రత్యేక హోదా ఇవ్వకున్నా రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం సైతం ప్రాజెక్టులకు అవసరమైన నిధులకోసం కేంద్రం వైపు చూస్తోంది. రానున్న మూడేళ్లో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించే దిశగా బిజెపి పరిపాలన ద్వారా సంకేతాలను ఇస్తోంది. రెండేళ్ల పాలనపై మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.