ఫోకస్

ప్రకటనలే తప్ప ఆచరణ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల పాలన ప్రకటనలకే పరితమైంది. మిగులు రాష్ట్రంగా తెలంగాణ రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చామని చెబుతోంది. కానీ హామీల అమలును పరిశీలిస్తే 35 శాతం కూడా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి ఏర్పాటుకే సమయమంతా సరిపెట్టుకుంటోంది. హామీలు అమలు పరుస్తున్నామంటూ, కొత్త పథకాలు సత్ఫలితాలిస్తున్నాయంటూ ప్రచారానికే పరిమితమవుతున్నారు. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 75 శాతం నెరవేర్చామంటున్న పాలకులు కనీసం ఏడు శాతం కూడా అమలు చేయలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లక్షలాది ఎకరాలకు నీరందిస్తామని చెప్పుకొస్తున్న పాలకులు - అసలు వర్షాలేవి.. నీరెక్కడ నుంచి తెస్తారు.. చేపట్టిన ప్రాజెకులు ఎంత వరకు పూర్తయ్యాయి? అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వనరు వంటి వాటిపై శే్వతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, డిఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టుల భర్తీని విస్మరించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు లేదు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన నియామకాలు జరిగినట్టేనా? అదేవిధంగా ఆంధ్రాలో బిసిలకు నిధుల కేటాయింపు, రైతులకు పరిహారం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ నియామకాలు, బిసిల రిజర్వేషన్ల పెంపు, కాపులను బిసిల్లో చేర్చే అంశం ఊసెత్తడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఎంతమేరకు అమలు చేశారని రెండు తెలుగు రాష్ట్రాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అభివృద్ధిలో పోటీపడడం మంచిదే. కానీ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తెరగాలి. పాలక వర్గాలు పాలనాపరమైన విధానాలను పక్కనబెడుతూ పార్టీల ఫిరాయింపులపైనే ఆసక్తి చూపుతున్నాయ. ఏదీఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై పోటీ పెరిగిందని చెప్పవచ్చు.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్