ఫోకస్

ఎప్పుడో ప్రశ్నించాల్సింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శించడంతో టిఆర్‌ఎస్ నాయకుల్లో వణుకు పెట్టింది. పభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో కోదండరాం ఇప్పటికే ఆలస్యం చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆరు నెలలే పరీక్షా కాలంగా గడువు ఇవ్వాల్సింది. ఆ తర్వాత ఎప్పుడో ప్రశ్నించి ఉంటే బాగుండేది. తప్పటడుగులు వేస్తున్నప్పుడే సరిదిద్దాలి. అయితే సమాజంలో విశ్వసనీయత ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించడంతో, ప్రజల్లో చైతన్యం వస్తుందని గ్రహించిన ప్రభుత్వం, టిఆర్‌ఎస్ పార్టీ ఎదురు దాడికి దిగింది. అయినా ప్రజలెవ్వరూ ప్రభుత్వం, టిఆర్‌ఎస్ నేతల విమర్శలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతృత్వ పోకడకు బ్రేకు వేయాల్సిన సమయం ఇది. ఇంట్రా పార్టీ అంటే తండ్రి-తనయుడు రాజ్యమేలుతూ, క్యాంపు ఆఫీసును అంతఃపురంగా మార్చుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మేనల్లుడైన రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావును సైతం పక్కన పెట్టారు. ఆర్థిక, రెవెన్యూ, హోం తదితర శాఖల మంత్రులు రబ్బరు స్టాంపుల్లా మారారు. బుగ్గ కార్లలో తిరగడం మినహా వారు ఒనగూర్చేది ఏమీ లేదు. పైగా తెలంగాణలో టిఆర్‌ఎస్ తప్ప ఏ రాజకీయ పార్టీని బతకనివ్వరాదని భావించడం, ఒక్కో పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదు. రాజరిక వ్యవస్థలా ఒకే పార్టీ ఉండాలనుకోవడం మంచిది కాదు. ప్రభుత్వ వైఫల్యాలను టిడిపి విమర్శిస్తే ఆంధ్ర పార్టీ అన్నారు, కాంగ్రెస్ విమర్శిస్తే అధికారం కోసం మాట్లాడుతున్నదని అన్నారు. కానీ ఏ పదవులు ఆశించకుండా, రాజకీయ స్వలాభాపేక్ష లేని కోదండరామ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంతో టిఆర్‌ఎస్ నాయకులు గాబరా పడ్డారు. రానున్న రోజుల్లో ప్రొఫెసర్ బలమైన శక్తిగా అవతరిస్తారేమోనన్నది వారి భయం. కాంగ్రెస్ బలమైన శక్తిగా ఉన్నదని, మధ్యలో కోదండరాం రావడంతో భారీ నష్టం వాటిల్లుతుందని టిఆర్‌ఎస్ ఆందోళన చెందుతున్నది. ప్రొఫెసర్ కోదండరామ్ ప్రతి వ్యాఖ్యలో వాస్తవం ఉన్నది. అందుకే టిఆర్‌ఎస్ నేతల గుండెల్లో గుబులు.

- దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి