ఫోకస్

అభివృద్ధి కోసమే విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర సాధన ఉద్యమ సారథుల్లో ఒకరైన ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వంపై చేసిన, చేస్తున్న విమర్శలు కేవలం అభివృద్ధి కోసమే. కోదండరామ్ విషయంలో రాష్ట్ర మంత్రుల తీరు అత్యంత జుగుప్సాకరం. తెరాస మంత్రులు కోదండరామ్‌ను విమర్శించడం వారి అహంకారానికి పరాకాష్ట. ఉద్యమంలో తెరాస పాత్ర కానీ, కెసిఆర్ పాత్ర కానీ తక్కువేమి కాదు. అయితే తెలంగాణ అంటే టిఆర్‌ఎస్, కెసిఆర్ మాత్రమే అంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదు. తెలంగాణ ఉద్యమం కేవలం తెరాసతో మాత్రమే ప్రారంభమైంది కాదు. ఇది ఎన్నో సంవత్సరాల బతుకు పోరాటం, దశాబ్దాల పోరాటం, ఎన్నో త్యాగాలు, వేలాది మంది బలిదానాలు, సకల జనుల సమ్మెతో కూడుకుంది. ఈ పోరాటంలో కవులు, కళాకారులు, విలేఖరులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, పిల్లలు, పెద్దలు, యువకులు, ఎన్నారైలు, విద్యావంతులు, గల్లిగల్లీ కాదు, ఇల్లు, ఇల్లు ఊరు, వాడా కదిలితేనే ఉద్యమం తీవ్రరూపం దాల్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తోడ్పడింది. ఇందులో కెసిఆర్ ఒక ఎపిసోడ్ మాత్రమే. కానీ అంతా మీరే.. అనే ఆలోచన వ్యవహారం అవివేకం. గండిపేట మహానాడు దగ్గర ఓయూ విద్యార్థి నాయకులపై దాడి చేయించిన మంత్రి మహేందర్ రెడ్డి, సమైక్యాంధ్ర కోసం చివరివరకూ పోరాడిన తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్‌లో కెసిఆర్‌ను అడుగుపెట్టనివ్వనన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం లేదని చెప్పేందుకు ఎన్నికల బరిలో దిగిన ఇంద్రకరణ్‌రెడ్డి, టిడిపి అగ్రనాయకత్వం స్థాయికి చేరిన కడియం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మంత్రులయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ అవకాశవాది అయ్యారా? ఇది పాలకులు గ్రహించదగ్గ విషయం. ప్రజాసంక్షేమం కోసమే కోదండరాం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై వేలెత్తి చూపడం, ప్రజా సంక్షేమానికేనన్న ఉద్దేశాన్ని పాలకులు స్వీకరించాల్సిన అవసరం ఉంది.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్