ఫోకస్

జెఎసి అంటే టిఆర్‌ఎస్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆయన మంత్రివర్గ సహచరులు వాస్తవాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ రాజకీయ పార్టీల జెఎసి అంటే టిఆర్‌ఎస్ అనుకుంటున్నారేమో! తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమం కొనసాగిన కాలంలో, ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు, ఉద్యమం జోలికి అసలు రానివారు కూడా ఇప్పుడు మంత్రివర్గంలో ఉంటూ కోదండరాంను విమర్శించడం హాస్యాస్పదం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కోదండరాం పాత్ర అమోఘం. తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు, తెలంగాణ ప్రజలకు వౌలిక సదుపాయాలు కలగాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగాలని ప్రజలంతా భావించారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారు. అనేకమంది ఆస్తులు కోల్పోయారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని, స్వచ్ఛమైన తెలంగాణ పాలన సాగాలని కోరుకున్నారు. కోదండరాం ఏం చేశారు. రెండేళ్లనుండి కెసిఆర్ పరిపాలనను గమనించారు. తప్పు జరిగిన సందర్భాలలో లేఖలద్వారా హెచ్చరించారు. ప్రభుత్వం తెలిసో తెలియకో తప్పులు చేస్తే, వాటిని కోదండరామ్ ఎత్తిచూపారు. కెసిఆర్‌కు ఆయన మంత్రివర్గ సహచరులకు జ్ఞానోదయం అయితే, కోదండరాం ఎత్తిచూపిన అంశాలను పరిశీలించి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాకపోగా, కోదండరాంపైనే ధ్వజమెత్తారు. కోదండరామ్‌పై కెసిఆర్‌కు, ఆయన మంత్రివర్గ సహచరులకు గౌరవం ఉంటే ఆయన ప్రస్తావించిన అన్ని అంశాలపై ఆయనతో, ప్రతిపక్షాలతో చర్చిస్తే బాగుండేది. అనాలోచితంగా కోదండరామ్‌పై ధ్వజమెత్తడం అవివేకం అవుతుంది. ప్రభుత్వ పరిపాలనను ఎవరూ విమర్శించవద్దంటే ఎలా కుదురుతుంది. ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని, అందరికీ విద్య, వైద్యం అందించాలని, సాగునీటిని వీలైనంత ఎక్కువ భూమికి అందించాలని, అన్ని గ్రామాలకు తాగునీటిని అందించాలని, అందరికీ న్యాయం చేయాలని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలని అంతా కోరారు. కెసిఆర్ పాలన నిజంగా అలాగే కొనసాగుతోందా? అంటే.. కుటుంబ పాలన సాగుతోందన్న జవాబు వస్తోంది. ప్రభుత్వంలో ఆయన కుటుంబ సభ్యులు తారకరామారావు, హరీశ్‌రావు, కవిత కీలక వ్యక్తులుగా మారారు. కోదండరాం తిరుగుబాటుకు ఇదీ ఒక కారణం. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన కోదండరాంకే కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సాధారణ ప్రజల సంగతేమిటి? ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు.

- జూలకంటి రంగారెడ్డి సిపిఎం కార్యదర్శివర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ