ఫోకస్

ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్న మాట అంటే ఉలికి పడ్డారన్న చందంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు, రాష్ట్ర మంత్రులకూ అక్షరాల వర్తిస్తుంది. టి.జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్న మాట అంటే ఆ పార్టీ నాయకులు, మంత్రులు ఒంటికాలిపై లేచారు. భూసేకరణ, ఓపెన్‌కాస్ట్ మైనింగ్ విషయంలో, కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పరంపర, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చేయూతనివ్వకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడం వంటి అనేకానేక అంశాలను ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశ్నించడంలో తప్పేముంది? అమరుల అమరత్వాన్ని కించపరిచిన వారికి అందలం ఎక్కించడం గురించి, ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ప్రొఫెసర్ కోదండరామ్ ఎత్తి చూపడమే చేసిన తప్పా? ప్రొఫెసర్ చేసిన విమర్శలను ప్రభుత్వం, టిఆర్‌ఎస్ సద్విమర్శలుగా స్వీకరించే మానసిక పరిపక్వత కొరవడిందని స్పష్టమవుతున్నది. వ్యక్తుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం భావ్యం కాదు. సిద్ధాంతపరంగా చర్చించినా, ఆరోపించినా ప్రజలు వాటిని స్వీకరిస్తారు తప్ప అధికారం ఉంది కదా అని మందబలం చూపిస్తే ప్రజలనుంచి, ప్రతిపక్షాలనుంచి ప్రతిఘటన తప్పదు. ఉదాహరణకు భూసేకరణ చట్టం-2013 నుంచి అమలులో ఉండగా, భూమిని ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి సేకరించి ఇవ్వడానికి అవకాశం కల్పించే జివో నెం. 123 దండగ అనే భావన మీకు ఎందుకు కలిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రులు అక్రమంగా కబ్జా, వ్యాపారాలు, ఎమ్మార్ భూములు, పద్మాలయ స్టూడియో, ల్యాంకో హిల్స్ భూముల గురించి గొప్పగా మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్ళు అయినా ఆ వైపు దృష్టి ఎందుకు సారించలేదు. ఆ భూములు తెలంగాణ రైతులకు తిరిగి ఎందుకు దక్కలేదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదు కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లు ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
అదిరింపులు, బెదిరింపులు, వైర్ల కత్తిరింపులతో ప్రభుత్వాన్ని నడిపించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకోవడం సరికాదు, మూర్ఖత్వమే అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన వారికి అడియాసే అయ్యింది. తెలంగాణ సాధన కోసం స్వలాభాపేక్ష లేకుండా రైళ్ళకు ఎదురు నిలబడి వికలాంగులైన వారికి, పెట్రోలు పోసుకుని శరీరంలో సగభాగం కాలిపోయి, మిగిలిన సగభాగంతో దుర్భర జీవితం గడుపుతున్న వారిని ఎవరు ఆదుకుంటారు? ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి నిలిచిన డిఎస్‌పి నళిని ఎక్కడున్నారు? రెండేళ్లయినా వివిధ వర్సిటీలకు విసిల నియామకం ఏదీ? ఇలాంటి వాస్తవాలెన్నింటినో ప్రశ్నించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు సమాధానాలు ఇవ్వలేక ఎదురు దాడి చేయడం న్యాయం కాదు. ప్రజలు దీనిని హర్షించరు.

- ఎం. రఘునందన్ రావు అధికార ప్రతినిధి, తెలంగాణ బిజెపి