ఫోకస్

ప్రజల క్షేమం కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి (టిజెఎసి) ప్రజల పక్షాన నిలబడటం తప్ప మరో ప్రయోజనం కానీ, ఏజెండా కానీ లేదు. జెఎసిని స్థాపించిన రోజునే తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడుతామని, రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర అభివృద్థికోసం పని చేస్తున్నామని అప్పుడే చెప్పాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల అభివృద్ధి నమూనాను అమలు చేయడాన్ని తిరస్కరిస్తున్నాం. ప్రజల పక్షాన, ప్రజలకోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, దాడులు జరిగినా ఈ ప్రయాణం కోనసాగుతూనే ఉంటుంది. ఇందులో ఏరకమైన స్వార్థ ప్రయోజనాలు లేవన్నది సుస్పష్టం. జెఎసికి ప్రజా సంక్షేమమే లక్ష్యం. ప్రజల సంక్షేమం కోసం చేపట్టాల్సిన అంశాలను రాజకీయ ఏజెండాపై తీసుకెళ్లడానికి జెఎసి కర్తవ్యంగా భావిస్తున్నాం. రాష్ట్ర సాధనకోసం ఏరకంగా కృషి చేశామో, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర ప్రజాసంఘాలతో కలిసి కార్యాచరణను నిర్మాణం చేస్తాం. రైతుల ఆత్మహత్యలు, కరువు పరిస్థితులపై జెఎసి ఇప్పటికే రాష్టమ్రంతా పర్యటించి, వారి ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పించాం. అలాగే ఓపెన్ కాస్ట్ గనులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించబోతున్నాం. త్వరలో రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని, అలాగే యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించబోతున్నాం. మరోవైపు మల్లన్నసాగర్ బాధితులతో మెదక్ జిల్లా గజ్వేల్‌లో సదస్సు ఏర్పాటు చేసి వారికి భూ సేకరణ చట్టంపై అవగాహన కల్పించాలని జెఎసి నిర్ణయించింది. ప్రస్తుతానికి జెఎసి ముందున్న కార్యాచరణ ఇది. రాష్టల్రో మూతపడిన పరిశ్రమలను తెరవాలని, హైకోర్టు విభజన జరగాలని, రాష్ట్రంలో సాగునీరు, మంచినీటి కోసం ప్రవేశపెట్టిన పథకాల డిపిఆర్‌లను ప్రజల ముందుంచాలన్నది జెఎసి డిమాండ్. జెఎసి ఇంతకు ముందు కూడా ప్రజా సంఘంగానే ఉంది, ఇకముందు కూడా అలాగే తన పని తాను చేసుకుపోతుంది. తాము చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు, ఆగ్రహాన్ని కలిగించినప్పటికీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటంలో జెఎసి రాజీ పడబోదు.

- ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ