ఫోకస్

కొత్త అథారిటీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో వినోద పరిశ్రమలో బ్లాక్ మనీ ఎక్కువ. అన్ని రంగాల్లో అక్రమంగా సంపాదించిన పెద్దలందరూ చిత్ర నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులకు రిటర్న్స్ రావాలి. అందుకే విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టం వచ్చినట్లు సినిమాలను నిర్మిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీస్తూ ఇష్టం వచ్చినట్లు సినిమాలను తీస్తున్నారు. ఇందులో మసాలా చొప్పిస్తున్నారు. అర్థంపర్థం లేని జుగుప్స కలిగించే సన్నివేశాలు, డైలాగులు, పాటలతో సినిమాలను నిర్మిస్తున్నారు. మన వ్యవస్ధపై తీవ్రమైన ప్రభావం చూపెట్టే ప్రసార సాధనం సినిమా. సినిమా వ్యవస్థను నియంత్రించేందుకు రెగ్యులేటరీ అథారిటీ ఉండాలి. సెన్సార్ బోర్డు కూడా ఒక రకంగా విఫలమైంది. సెన్సార్ బోర్డు స్థానంలో అథారిటీని ఏర్పాటుచేసి రాజ్యాంగబద్ధమైన అధికారాలను కల్పించాలి. సినిమా అంటే మేక్ బిలీఫ్ బిజినెస్. ఒక సినిమాలో కొన్ని కల్పితాలను వాస్తవానికి మించి జోడించక తప్పదు. అలాగే సమాజంలో ఉండే దురాచారాలను, వాటివల్ల జరిగే అనర్ధాలను సినిమాలో చూపించాల్సిందే. మద్యపానం, ధూమపానం సన్నివేశాలు చూపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇవి హానికరం అనే టైటిల్స్ వేస్తున్నారు. అశ్లీలం, కొన్ని వర్గాలను కించపరిచే దృశ్యాలను కత్తిరించేందుకు బలమైన వ్యవస్థ మనకు లేదు. అలాగే కొంతమంది సినిమా దర్శకులు ప్రతి అంశంపైన స్పందిస్తున్నారు. వంగవీటి పేరుమీద సినిమా తీస్తానని ఒక దర్శకుడు ముందుకువస్తున్నారు. ఇదే నిజమైతే రాష్ట్రంలో సగం జిల్లాల్లో ఘర్షణలు జరుగుతాయి. కొన్ని సంవత్సరాల క్రితం పులివెందుల పేరుమీద ఒక దర్శకుకడు సినిమా తీస్తామంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మానుకున్నారు. మరో సినిమాలో రెండు సామాజిక వర్గాలను దూషిస్తూ, కించపరిచే విధంగా డైలాగులు ఉన్నాయి. అందుకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సినిమా రంగాన్ని నియంత్రించేందుకు తప్పనిసరిగా రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో నిపుణులు, అనుభవం ఉన్న వారిని నియమించాలి.

- సలాం బాబు, అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం