ఫోకస్

లక్ష్మణ రేఖ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలన్నింటికీ ఒక లక్ష్మణరేఖ అవసరం. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను కాంగ్రెస్, కమ్యూనిస్టులు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. అధికార పక్షం భావ జాలానికి చెందిన వారిని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లకు, సెన్సార్ బోర్డు ఏ సంస్థలో నియామకాలైనా విపక్షాలు అతిగా స్పందిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భావ జాలం ఉన్నవారిని నియమిస్తున్నారని అంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేసేది ఇదే. అశ్లీలం, శృంగారం, ప్రజల మధ్య విద్వేశాలను రెచ్చగొట్టే అంశాలతో సినిమాలు తీసేవారు ఈ లక్ష్మణ రేఖ ఉంటుందని గ్రహించాలి. ప్రపంచంలో సెన్సార్ విధానం ఒక్క మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉంది, ఉండాలి కూడా. కులం, మతం, దేశంపై విద్వేశాన్ని రెచ్చగొట్టే విధంగా సినిమాలు నిర్మిస్తాం మా ఇష్టం అంటే కుదురుతుందా? ఇలాంటి విషయాల్లో సెన్సార్ బోర్డు కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. మాటలతో, దృశ్యాలతో అశ్లీలం చూపించడాన్ని అడ్డుకోవలసిన అవసరం ఉంది. మేధావులు, ఈ దేశం అంటే అభిమానం ఉన్నవారితో సెన్సార్ బోర్డు ఉండాలి. పరస్పర భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల మేలు ముఖ్యం అని భావించే వారు సెన్సార్ బోర్డులో ఉండాలి. లక్ష్మణరేఖను పాటిస్తూ సినిమాలు తీయాలి. అదే విధంగా సెన్సార్ చేసే వారు సైతం లక్ష్మణ రేఖను పాటించాలి అదే దేశానికి సమాజానికి మంచిది.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి