ఫోకస్

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెన్సార్ బోర్డుగా అంతా వ్యవహరించే కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ వ్యవహార తీరు మరోమారు ‘ఉడ్తా పంజాబ్’ సినిమాతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఏదో ఒక భాషాచిత్రానికి సంబంధించిన వ్యవహారానికే పరిమితమైన విషయం కాదు, దేశంలో అన్ని భాషల్లో ఏదో ఒక చిత్రం సెన్సార్ బోర్డు చట్రంలో నలిగి చిక్కి విడుదలకు సైతం నోచుకోని సంఘటనలు అనేకం. కొన్నిమార్లు ఏళ్ల తరబడి అదృశ్యమైన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. తెలుగులో ‘కెమెరామన్ గంగతో రాంబాబు’, ‘దేనికైనా రెడీ’ సహా చాలా చిత్రాల సెన్సార్‌లో జాప్యం లేదా బోర్డు ఇచ్చిన ‘కట్స్’పై వివాదం పెద్దఎత్తునే జరిగింది. కులాలను, మతాలను కించపరిచేలా దృశ్యాలు ఉన్నాయని, పాత్రలు సమకాలీన వ్యక్తులను తలపించేలా ఉన్నాయని, వృత్తి, ఆదర్శాలకు భిన్నంగా లేదా కించపరిచేలా ఉన్నాయనే పేరుతో సెన్సార్‌బోర్డు కొన్ని చిత్రాల్లో దృశ్యాలను తొలగించడమో లేదా మార్చుకోమని చెప్పడమో జరుగుతుంది. చిత్ర కథ, కథనం, దృశ్యరూపాన్ని దృష్టిలో ఉంచుకుని సర్ట్ఫికెట్లను జారీ చేస్తుంది. సెన్సార్ బోర్డు వ్యవహరించిన తీరు అనేక చిత్రాల విషయంలో వివాదాలు చెలరేగి చివరికి చైర్మన్లు సైతం రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. 1920లో మొదలైన సెన్సార్ బోర్డు 1952 తర్వాత పద్ధతి ప్రకారం ఒక స్వరూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం పహ్లాజ్ నిహలాని చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సిబిఎస్‌సికి దేశవ్యాప్తంగా ప్రాంతీయ సెన్సార్ బోర్టులున్నాయి. హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు సిఇఓ ఒక చిత్ర నిర్మాత నుండి లంచం తీసుకుంటూ కూడా దొరికిపోయారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సెన్సార్ బోర్డు తీరుతెన్నులు, వ్యవహార సరళి వేగంగా మారిపోతున్న సమాజంలో సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఎవరికైనా అనిపిస్తుంది. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమా సెన్సార్ సమయంలో జరిగిన వివాదం అంతా ఇంతా కాదు, ‘స్పెక్ట్రా’ సినిమాలో ముద్దు సన్నివేశాలు, ‘డెడ్ పూల్’ సినిమాలో దృశ్యాలు బోర్డుపై నమ్మకాన్ని వమ్ముచేశాయి. ఉడ్తా పంజాబ్ చిత్రానికి 89 సీన్ల కట్‌లు ఇచ్చిన సెన్సార్ బోర్డు వివాదం చెలరేగి హైకోర్టు వరకూ వెళ్లడంతో ఒక్క కట్‌తో బయటపడింది. తాజాగా మరో గుజరాతీ సినిమా సెన్సార్ కోరల్లో చిక్కుకుంది. దాంతోపాటు ‘సాలడ్బో సావల్- అనామత్’ చిత్రానికి బోర్డు వంద కత్తెర్లు వేసింది. ఆ దారిలోనే ‘పవర్ ఆఫ్ పటీదార్’ కూడా ఉంది. రోజురోజుకూ సినిమాల్లో దృశ్యాలు, పదాలు, సంభాషణలు విరక్తి కలిగిస్తూ సెన్సార్ బోర్డు ఆయా చిత్రాల విడుదలకు ఎలా అనుమతించాయనే ప్రశ్నలూ రావడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో సెన్సార్‌బోర్డు తీరుతెన్నులపై కొంతమంది చలనచిత్ర ప్రముఖులు, ఇతరుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.