ఫోకస్

ఆంధ్ర వల్లే సమస్య తీవ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీని వితండవాదంతో ఆంధ్రప్రదేశ్ సంక్లిష్టంగా మారుస్తోంది. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటాను వదులుకునే ప్రసక్తి లేదు. మా వాటా మాకు కావాలి కానీ ఆంధ్రకు చెందిన ఒక్క నీటి చుక్క కూడా మాకు అవసరం లేదు. కర్నాటక, మహారాష్టల్రతో సమస్యలను పరిష్కరించుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం వితండ వాదంతో సమస్యను సంక్లిష్టంగా మారుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల వాటా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతనే కృష్ణా బోర్డు వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహారాన్ని గతంలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. కృష్ణా బోర్డు ఒంటెద్దు పోకడలను తెలంగాణ మంత్రివర్గం కూడా తీవ్రంగా ఖండించింది. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటి ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ అర్థ సత్యాలు, అవాస్తవాలతో ఎపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ప్రచారం చేస్తోందని పలుసార్లు ఫిర్యాదులు చేశాం. ఏపీకి వంతపాడుతూ ఆర్‌కె గుప్తా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని కృష్ణా బోర్డు వైఖరికి నిరసనగా ప్రధాన మంత్రిని కలవాలని కెసిఆర్ భావించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పూర్తికాకముందే తమ నియంత్రణలోకి తీసుకోవడానికి కృష్ణా బోర్డు ప్రయత్నాలు చేసింది. కృష్ణా నదీ జలాలను వినియోగిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సంప్రదించకుండా, విస్తృతంగా చర్చలు జరపకుండా ఏకపక్షంగా బోర్డు నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తే, కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశాం. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటా తేలేంత వరకు నోటిఫికేషన్ జారీ చేయవద్దని ముఖ్యమంత్రి ఇంతకుముందే కేంద్రాన్ని కోరారు. ఇప్పటి వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పంపిణీ జరుగుతోంది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో ప్రాజెక్టులవారీగా తెలంగాణ వాటా తేలాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరవై ఏళ్లపాటు తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించాం. తెలంగాణ సాధించుకున్నాం. న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా వదలుకునే ప్రసక్తి లేదు. కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుని కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రైతులకు మేలు జరగాలని, వృధాగా సముద్రంలో పోయే నీటిని వినియోగించుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రకు ఎప్పుడో స్నేహ హస్తం అందించిన విషయం మరువవద్దు.

- తన్నీరు హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రి, తెలంగాణ