ఫోకస్

తెలంగాణది మొండివాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెఆర్‌ఎంబి ఏర్పాటవగానే అమలులో ఉన్న ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆయా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. తెలంగాణ తెలిసీ తెలియక మొండివాదన చేస్తోంది. తెలంగాణ వైఖరి అమానుషం, దుర్మార్గం. స్వార్థ ప్రయోజనాలకోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలని చూస్తోంది. ఇది సరికాదు, మీకు న్యాయవాదులున్నారు, న్యాయ సలహాదారులున్నారు, వారిని అడిగి నిబంధనలు తెలుసుకోండి, కెఆర్‌ఎంబి ముసాయిదాను నోటిఫై చేయకుండా అడ్డుతగలడం న్యాయమా? మేం ఒక్క సాగర్ ప్రాజెక్టు నిర్వహణనే బోర్డు పరిధిలోకి తేవాలని కోరామనడం అబద్ధం. అంతా బాగుండాలనే కోరుతున్నాం, తెలంగాణకు చెందిన నీటిచుక్క కూడా మాకు వద్దు, పోలవరం, పట్టిసీమ నిర్మిస్తేనే తెలంగాణకు మరో 90 టిఎంసిలు ఇవ్వాలనడం సరికాదు, దానిపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదు, మీరు కడుతున్న కొత్త ప్రాజెక్టుల సంగతి అపెక్స్ కౌన్సిల్‌లోనే తేలాలి. గత రెండేళ్లలో విభజన చట్టం ఉల్లంఘనకు పాల్పడుతూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి విడుదలలో ఏపిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నది వాస్తవం అని ఇపుడు అందరికీ అర్థమయింది. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేసే ప్రక్రియ వేగవంతం చేసేందుకు అందరూ ముందుకు రావాలి. నీటి వినియోగం, పంపిణీపై కేంద్ర జలసంఘానికి చెందిన ముగ్గురు నిపుణులతో కమిటీ వేస్తామని కేంద్రమే చెబుతోంది కదా. కేంద్రం ఎప్పుడు పిలిచినా మేం చర్చలకు సిద్ధం. ఆంధ్రా భూభాగంలోని సాగర్ ప్రాజెక్టు గేట్లను తామే ఆపరేట్ చేస్తామని తెలంగాణ వాదించడం ఏ విధంగా చూసినా సబబుకాదు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా, శ్రీశైలం ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎపికి లేదా కృష్ణా బోర్డుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం వారి ఆధీనంలో ఉన్న కుడివైపు విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటూ రిజర్వాయిర్‌ను ఖాళీ చేసిన ఉదంతాన్ని కేంద్రం గుర్తించింది. తెలంగాణ నిర్వాకం మూలంగా కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయలేకపోయాం. తెలంగాణ ఉద్దేశ్యపూర్వకంగానే అలా చేస్తోంది. డిపిఆర్ లేకుండా, కేంద్ర జలసంఘం, కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ కృష్ణా బేసిన్‌లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. శ్రీశైలం వద్ద ఒకవైపువిద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ మరోవైపు పాలమూరు ఎత్తిపోతలను చేపడితే రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఎక్కడినుండి వస్తాయి? జలవివాదాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువెళ్తామని తెలంగాణ అంటోంది, అన్ని రాష్ట్రాలకూ అన్ని హక్కులూ, అవకాశాలూ ఉంటాయి, వారు ఎక్కడికి వెళ్లాలనేది వారి ఇష్టం.

- దేవినేని ఉమామహేశ్వరరావు జల వనరుల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్