ఫోకస్

నిఘా మరింత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీవ్రవాదం, ఉగ్రవాదం, విచ్చిన్నకర కార్యకలాపాలకు ప్రస్తుతం అక్కడా ఇక్కడా అని ఏమీ లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకుంటూ పోతోంది. కొనే్నళ్లగా మతోన్మాద తీవ్రవాదం పెరిగిపోయింది. ప్రభుత్వం తీవ్రవాదం, ఉగ్రవాదం ముసుగులో ఉన్న అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలి. ఇటీవల పారిస్‌లో ఉగ్రవాదుల దాడి ప్రపంచాన్ని వణికించింది. మాలెలో కూడా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇక తీవ్రవాదం గురించి మాట్లాడితే అది పుట్టిందే ఆర్థిక, సామాజిక అసమానతలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అని చెప్పాలి. కానీ రాజకీయపరంగా తలెత్తుతున్న సమస్యల కారణంగా మరింత బలపడిందని చెప్పాలి. సమాజానికి చెడుచేసే తీవ్రవాదమైనా, ఉగ్రవాదమైనా అణచివేయాల్సిందే. కానీ సమాజంలో దోపిడీ వర్గాలకు చెక్‌పెట్టే వ్యవస్థను అధికారంలో ప్రభుత్వాలు అవలంభించాల్సి ఉంటుంది. ఎపి, తెలంగాణలో తీవ్రవాద కార్యకలాపాల ముసుగులో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. వీటిని అరికట్టాలి. ఆయా ప్రభుత్వాల తీరును బట్టి తీవ్రవాదం క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఇలా ఎందుకు పెరుగుతూ వచ్చిందో ఆ కారణాలను అనే్వషించి, తగిన పరిష్కారాలు కనుగొనాలి తప్ప అనవసరమైన ఆలోచనలతో అడ్టుకట్ట వేయాలని చూడ్డం సరైన పరిష్కారం కాదు. శాంతిభద్రతల సమస్యగా తీవ్రవాదాన్ని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఆ వాదన సరైనది కాదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పి సరిచేయగలిగితే సమస్యే ఉండదు. ఇక విచ్చిన్నకర కార్యకలాపాల విషయానికొస్తే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుతో దేశ వ్యాప్తంగా విచ్చినకర కార్యకలాపాలు పెరిగిపోయాయి. మతోన్మాద వైఖరితో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. సమాజాన్ని ఈ రకమైన శక్తులు శాసిస్తున్నాయి. మోదీ పాలనలో మతోన్మాద విచ్చిన్నకర శక్తులు పెరిగిపోయాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరాచకం పెరిగిపోయింది. పట్టపగలే కార్యాలయాల్లో చొరబడి కాల్పులకు తెగబడుతున్నారు. మేయర్, దంపతులను కాల్చి చంపారు. పాలకపక్షం టిడిపి ఉంటే హత్యకు గురైనవారు టిడిపి నేతలే, చేసినవారు అదే పార్టీకి చెందినవారే. హత్యకు నిరసనగా బంద్ చేసిందీ టిడిపి వర్గమే. ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ దేశంలో జరుగుతున్న మత అసహనంపై స్పందించకుండా పారిస్‌లో జరిగిన ఉగ్రవాదుల మారణహోమాన్ని ఖండించడం చూస్తుంటే ఆయన ద్వంద్వవైఖరి కనిపిస్తోంది. వీటన్నింటికి పరిష్కారం ప్రభుత్వాల తీరు మారడంతోనే సాధ్యమని చెప్పాలి.

- కె.రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి