ఫోకస్

ఆందోళనలు దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవాదుల సమస్యలు, న్యాయాధికారుల అధికారాలు సమన్వయ పరచేది న్యాయస్థానాలే. అలాంటి న్యాయ వ్యవస్థలో ఆందోళనలు, సస్పెన్షన్లు జరగడం దురదృష్టకరం. సమాజంలోని ఏ వ్యవస్థనైనా చివరకు ఆశ్రయించేది న్యాయవ్యవస్థనే. అలాంటి న్యాయ వ్యవస్థ రోడ్డెక్కడం విస్మయానికి గురిచేస్తోంది. ఉన్నత న్యాయస్థానం పరిష్కరించాల్సిన అంశాలను బహిరంగమయ్యాయి. ఆంధ్రా న్యాయాధికారుల నియామకాలతో తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగడం, నిరశన ప్రదర్శనలు చేపట్టడంలో తప్పులేదు. న్యాయ వ్యవస్థ అందరికీ సమానోగ్యత కల్పించే దిశగా చర్యలకు పూనుకోకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతాయనడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా మార్పు జరగడం అనివార్యమే. ప్రభుత్వంలోని కొన్ని శాఖలు వేరైనప్పుడు.. న్యాయ విభాగంలో ఎందుకు మార్పులు జరగకూడదు? న్యాయాధికారుల చిన్న సమస్య జాతీయ స్థాయిలో చర్చకు రావడం ఎవరి వల్లనోనన్న విషయం అర్థం చేసుకొని పరిష్కరించుకుంటే సమస్య సద్దుమణిగేది. కానీ ఢిల్లీ వరకు చేరిన ఈ సమస్య పరిష్కారంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఈ సమస్య కేంద్రానిదంటూ రాష్ట్రం.. రాష్ట్రానిదేనంటూ కేంద్రం పరస్పరం వ్యాఖ్యానించుకోవడం అనర్థమే. కోర్టుల్లో న్యాయం అందించాల్సిన న్యాయాధికారులే సస్పెన్షన్‌కు గురైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈ సమస్య రాష్ట్ర గవర్నర్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వరకూ వెళ్లింది. కాబట్టి వెంటనే న్యాయాధికారుల ఆప్షన్ల రద్దు, హైకోర్టు విభజన, సస్పెన్షన్లపై ప్రభుత్వాలు, ఉన్నత న్యాయవ్యవస్థ స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

- జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్