ఫోకస్

విభజనకు అడ్డంకేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు విభజనకు అడ్డంకి ఏమిటో ఉన్నతస్థాయి న్యాయమూర్తులే చెప్పాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఎపిలుగా విడిపోయిన తర్వాత అన్ని శాఖలు కూడా సామరస్యంగా విడిపోతే ఎలాంటి సమస్యా ఉత్పన్నం అయ్యేది కాదు. హైకోర్టును విభజించి రెండు రాష్ట్రాల హైకోర్టులను హైదరాబాద్‌లోనే కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గతంలోనే ప్రతిపాదించారు. ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకోసం వాడుకోవచ్చని, తెలంగాణ హైకోర్టుకు గచ్చిబౌలిలోని భవనాలను వినియోగించుకుంటామని కెసిఆర్ ప్రకటించిన విషయం గమనార్హం. ఇదే విషయాన్ని హైకోర్ట్ ఆఫ్ ఎపి అండ్ తెలంగాణ జ్యూడికేచర్ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు తెలియచేస్తే బాగుండేది. సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు ఎపి న్యాయమూర్తుల అభీష్టం మేరకే హైకోర్టు పరిపాలనాపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. న్యాయవ్యవస్థలో ఎపికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని వాస్తవ పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తుంటే తెలంగాణకు చెందిన వారు కేవలం ముగ్గురే ఉండగా, ఎపికి చెందిన వారు 20 మంది వరకు ఉన్నారు. ఇతరులు ఇతర రాష్ట్రాలకు చెందినవారు. జిల్లా కోర్టులు, మున్సిఫ్ కోర్టులో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 80 శాతం ఎపికి చెందిన వారే ఉన్నారు. హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరు ఇంచార్జీలుగా ఉంటూ వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎపికి చెందిన వారు కావడంతో జిల్లాస్థాయిలో జరిగిన నియామకాల్లో ఎపికి చెందినవారికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇప్పటికే న్యాయాధికారులుగా పనిచేస్తున్న వారికి ఎక్కడ పనిచేయదలచుకున్నారో ఆప్షన్ ఇచ్చారు. ఎపికి చెందిన వారు తెలంగాణలో పనిచేసేందుకు చాలా మంది ఆప్షన్ ఇచ్చారు. దాంతో వారి వినతికి హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మున్సిఫ్ మెజిస్ట్రేట్‌ల ఖాళీలు తక్కువగానూ, ఎపిలో ఎక్కువగానూ అయ్యాయి. తెలంగాణ న్యాయాధికారులు ఈ అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్లనే ఆప్షన్ ఉపసంహరించుకోవాలని, హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలోనే మున్సిఫ్ మెజిస్ట్రేట్ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇది సరైన సమయం కాదన్న అంశం హైకోర్టు గుర్తిస్తే బాగుండేది. హైకోర్టు విభజనకు ఇదే సరైన సమయం. విభజన జరిగితే ఆటోమెటిక్‌గా ఆందోళన పరిస్థితి సమసిపోతుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

- జి. విజయకుమార్ సీనియర్ న్యాయవాది, హైదరాబాద్