ఫోకస్

రాజేస్తున్నది రాష్టమ్రే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి హైకోర్టు విభజన, జ్యుడిషీయరీ విభజన అంశాలను కావాలనే పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ అంశాలను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రాన్ని ఏదోరకంగా విమర్శించడానికి, కేంద్రంపై బురద జల్లడానికి ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ప్రస్తుతం నెలకొన్న వివాదం పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు లేదనే చెప్పవచ్చు. ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చు, గవర్నర్ సమక్షంలో కూర్చొని పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ వివాదాన్ని రాజేసి రాజకీయంగా లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారు. అవసరమైనప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతగానే ఉంటున్నారు. అయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్వయంగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించారు. ఇద్దరి మధ్య ఉన్న సఖ్యతను హైకోర్టు విభజన, న్యాయాధికారుల విభజన అంశం పరిష్కారానికి ఎందుకు ఉపయోగించుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టు ఎలా ఉంటుందని ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు అయింది.
దీనిపై పిటిషన్‌దారు వాదనతో జడ్జీ కూడా ఏకీభవించారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు విభజన చేయడానికి అడ్డంకిగా మారింది. ఉన్న అడ్డంకి ఏమిటన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ బిజెపి ప్రభుత్వంపైనా, కేంద్రంపైనా విమర్శలు చేయడానికి ఈ అంశం పరిష్కారం కాకూడదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక న్యాయాధికారుల విభజన అంశానికి వస్తే అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రులు సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నించడం మాని ఈ వివాదాన్ని మరింత రాజేసి రాజకీయంగా లబ్ధిపొందడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

- ఎన్ రామచందర్ రావు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు