ఫోకస్

కేంద్రమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో న్యాయాధికారులు న్యాయం కోసం గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పినా స్పందన లేనప్పుడు న్యాయాధికారులు గళం విప్పడం మినహా మరో మార్గం కనిపించలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా న్యాయాధికారులకు అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు. ఇదో సమస్య అయితే హైకోర్టు విభజన మరో సమస్య. ఉమ్మడి హైకోర్టును విభజించాలని గత రెండేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం ఉన్న హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి మరో చోట తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేసేందుకు సైతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టుకు భవనం కేటాయించేందుకు ఆ రాష్ట్రం ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. దీనికోసం కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దీని వల్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. న్యాయాధికారులు దేశంలోనే తొలిసారిగా సామూహికంగా సెలవు పెట్టారు. ఊరేగింపుగా రాజ్‌భవన్‌కు బయలుదేరారు. న్యాయాధికారులతో పాటు వివిధ కోర్టుల్లో పని చేసే ఎనిమిది వేల మంది ఉద్యోగులు, న్యాయవాదులు ఉద్యమ బాట పట్టారు. న్యాయాధికారులను కేటాయించే సమయంలో నిబంధనల్లో లేకపోయినా ఆప్షన్ల విధానం పెట్టారు. దీంతో ఆంధ్ర న్యాయాధికారులు తెలంగాణను ఎంపిక చేసుకున్నారు. అంటే ఇక తెలంగాణలో మరో రెండు దశాబ్దాల వరకు తెలంగాణ వారికి న్యాయవ్యవస్థలో సరైన ప్రాతినిధ్యం లభించదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలి. ఈ దిశగా కేంద్రం రెండేళ్లలో చేసిందేమీ లేదు. హైకోర్టును విభజించే అంశంలో తమకు సంబంధం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి చెబుతున్నారు. ఆర్టికల్ 74 ప్రకారం హైకోర్టు విభజన బాధ్యత ముమ్మాటికీ కేంద్రానిదే. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకొని మరొకరి మీదకు నెట్టివేస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హైకోర్టు విభజనకు కాలపరిమిత నిర్ణయించక పోవడంవల్ల ఈ సమస్య తలెత్తింది. హైకోర్టు విభజనకు కాల పరిమితి నిర్ణయిస్తే విభజన చట్టాన్ని సవరించాలని 2015 నవంబర్‌లో లోక్‌సభలో ప్రైవేటు బిల్లు పెట్టాను. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్య తీసుకునేవారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపు ఈ రెండు సమస్యలు కేంద్రం పరిష్కరించాల్సినవే. ఇప్పటికైనా కేంద్రం తక్షణం తన బాధ్యతను నిర్వహించాలి.

- బి వినోద్‌కుమార్ టిఆర్‌ఎస్ ఎంపీ, న్యాయవాది