ఫోకస్

‘న్యాయం’కోసం పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ విభజన సెగ న్యాయస్థానాలకూ తాకింది. న్యాయాధికారుల విభజనలో తమకు అన్యాయం జరిగిందని న్యాయాధికారులు, న్యాయవాదులు రోడ్డెక్కి ధర్నాలకు దిగడంతో వ్యవహారం పీటముడివేసుకుంది. న్యాయ నియమ నిబంధనలకు విరుద్ధంగా న్యాయాధికారులు ధర్నాలకు దిగడం సరికాదని రెండు దశల్లో 13 మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో నిరసనలు కాస్తా ఉద్యమరూపాన్ని సంతరించుకున్నాయ. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ధర్నాలు మొదలయ్యాయి. అందుబాటులో ఉన్న న్యాయాధికారుల్లో 110 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 95 మందిని తెలంగాణకు హైకోర్టు కేటాయించింది. సంఖ్యాపరంగా ఎలాంటి వివాదం లేదు, అయితే తెలంగాణకు కేటాయించిన 95 మందిలో 58 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని న్యాయవాదులు ఆరోపించడం, ఆంధ్రావారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని, వారిని ఆంధ్రాకు పంపించాలని కోరడంతో వివాదం రాజుకుంది. న్యాయాధికారుల విభజన సక్రమంగా జరగాలంటే ముందు హైకోర్టు విభజన జరగాలని న్యాయవాదులు అంతా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దీనిపై స్పందించడం, స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్నాలు ఆపాలని, విధులకు హాజరుకావాలని న్యాయాధికారులను, న్యాయవాదులను కోరడంతో వారంతా ఒక మెట్టు దిగి నిరసనలు ఆపేస్తున్నట్టు చెప్పారు. అంత మాత్రాన ‘న్యాయవివాదం’ ముగిసినట్టు కాదు, లోలోపల రాజుకున్న ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకూ పోదన్నది సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏకాభిప్రాయానికి రెండు రాష్ట్రాలూ ముందుకువస్తే తమ వంతు సహకారాన్ని అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకూ హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడిగా రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అంటే ఉమ్మడి హైకోర్టు కాలవ్యవధి గరిష్ఠంగా పదేళ్లు ఉంది. ఆ సమయంలోగా రెండు రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు కావాలి. హైకోర్టు విభజన ఎలా జరగాలన్నదానిపై కేంద్ర గత న్యాయశాఖ మంత్రి సదానందగౌడ స్పష్టత ఇచ్చారు. హైకోర్టు విభజనకు సంబంధించి దాఖలైన పిల్ విచారణ దశలో ఉందని, కేంద్రం కూడా తమ వాదన వినిపించిందని, హైకోర్టులో ఆ కేసు పరిష్కారం అయ్యేవరకూ వేచి ఉండాలన్నది సదానంద గౌడ అభిప్రాయం. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత అవసరమైతే తాను ఢిల్లీలో దీక్ష చేస్తాననే రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంకేతాలు ఇవ్వడంతో దానిపై కూడా కొంత రగడ కొనసాగింది. ఒక దశలో పోలీసులకు, న్యాయవాదులకు యుద్ధవాతావరణం చోటుచేసుకుంది. దీంతో హైకోర్టు విభజన అంశం రోజురోజుకూ ముదురు పాకాన పడుతోంది. వాస్తవానికి హైకోర్టు విభజన ఇప్పట్లో జరిగేలా లేదనేది కూడా న్యాయవాదులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధానన్యాయమూర్తుల సూచనతో న్యాయాధికారులు ఆందోళన విరమించినా, ఈ అంశానికి పరిష్కారం ఎపుడో వేచిచూడాలి... దీనిపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.