ఫోకస్

అధిక ఫీజులు ఇబ్బందికరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సరీ నుంచి పిజి వరకు అధిక ఫీజుల సమస్య మధ్యతరగతి కుటుంబీకులను వేధిస్తోంది. ఓ వైపు ప్రభుత్వం, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి..ప్రాథమిక విద్యకు ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం.. ఇంటర్, డిగ్రీ, పిజి విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చాం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రోత్సహిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవడం లేదు. మరో వైపు ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధనా తరగతులు నిర్వహిస్తున్నామంటూ ప్రచారం సాగిస్తున్నారే తప్పా..బోధనా సిబ్బంది, స్కూళ్ల ఏర్పాటు, కనీస అవసరాల కల్పనపై దృష్టి సారించడం లేదు.
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించగల్గితే సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో సంతోషిస్తారు. ఇక కళాశాలల్లో వివాదాలు అంటే.. ఒక కళాశాల..అది ఇంటర్, డిగ్రీ, పిజి కావచ్చు. ప్రస్తుతం వీటి నిర్వహణ పోటాపోటీగా సాగుతోంది. ఒక పాఠశాల యాజమాన్యం ఓ రకమైన ఫీజులు వసూలు చేస్తే..మరో పాఠశాల యాజమాన్యం మరోవిధంగా ఫీజులు వసూలు చేస్తుంది. అదే తరహలో ఇంటర్, డిగ్రీ, పిజి కళాశాలల యాజమాన్యాలు కూడా ఫీజులు చేస్తున్నాయి. ఇలా విద్యా సంస్థల మధ్య పరస్పర అవగాహన లేమితో వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల రియింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించకపోవడంతోనే విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పూనుకుంటున్నాయి. దీంతో విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలు, బంద్‌లు, విధ్వంసక చర్యలు ప్రభుత్వాన్ని నష్టపరిచేవే..తప్ప ఎవరికీ ఉపయోపడేవి కావు. ఇప్పటికైనా అందరికీ విద్య అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించి, ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలో పటిష్ట పరచాలి. ప్రభుత్వం ఇతోధికంగా నిధులు కేటాయించాలి.

జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ కన్వీనర్