ఫోకస్

విద్యా వ్యవస్థలో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యావిధానం వల్ల అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల ప్రభుత్వం నిపుణులతో చర్చించి సంస్కరణలు చేపట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై తీవ్రమైన వత్తిడి తీసుకువస్తున్నారు. ఐఐటి, ఎన్‌ఐటిలలోనే బిటెక్ చదవాలని తమ పిల్లలపై విపరీతమైన వత్తిడి తెస్తున్నారు. ఈ వత్తిడి వల్ల పిల్లల్లో విపరీతమైన పోకడలు కనిపిస్తున్నాయి. బిఎస్‌సి, బికాం, ఎంఎ, ఎంకాం తదితర కోర్సుల వల్ల లభించే ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ఒక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. రాష్ట్రంలో 1.50 లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతుండగా, వీరిలో ఏటా 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇదే సమయంలో డిగ్రీపూర్తి చేసిన విద్యార్థుల్లో 80 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ కారణంగానే డిగ్రీకోర్సుల ప్రాధాన్యతల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఎంఎసెట్ తరహాలోనే హెచ్‌ఇసి, సిఇసి చదివే విద్యార్థులకోసం కామన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా డిగ్రీలో సీట్లు ఇవ్వాలి. ఆన్‌లైన్ ద్వారా డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాలి. పిజి స్థాయిలో ప్రవేశాలకు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఇదే విధానాన్ని ఎంఫిల్, పిహెచ్‌డి ప్రవేశాలకు కూడా కల్పించాలి. అన్ని విశ్వవిద్యాలయాలు కలిపి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అకడమిక్ క్యాలండర్ విడుదల చేస్తే బాగుంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పిస్తే ఈ స్థాయిలో డ్రాపవుట్ శాతం తగ్గుతుంది. ప్రభుత్వం విడుదల చేసే నిధులు సక్రమంగా ఉపయోగపడాలంటే ఆధార్ కార్డు ఆధారంగా ప్రవేశాలను కల్పించాలి. దానివల్ల నిజమైన పేదలకు లబ్ది చేకూరుతుంది.

వేణు ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు