ఫోకస్

అవగాహన లేని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యా విధానంపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు, స్పష్టమైన విధానం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్పష్టమైన విద్యా విధానంతో ముందుకు వెళతాం అని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత విద్యను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనిని బట్టి ప్రభుత్వానికి విద్యా విధానంపై ఎంత పట్టు ఉందో స్పష్టమవుతోంది. ఇంటర్‌లో పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 3 లక్షల వరకు ఉంటే, అందులో మెడిసన్, బి-్ఫర్మసీ వైపు లక్ష మంది వెళ్ళే అవకాశం ఉంది. రెండు లక్షల డిగ్రీ సీట్లు ఉంటే అంత మంది విద్యార్థులే లేరు. సుమారు 10 వేల మంది విద్యార్థులు విదేశాలకు, 20 వేల వరకు డ్రాప్‌అవుట్లు అయ్యే అవకాశం లేకపోలేదు. ఎక్కువ పోటీ ఉన్నప్పుడు ఆన్‌లైన్ అవసరం కానీ, సీట్ల కంటే విద్యార్థులే తక్కువ సంఖ్యలో ఉన్నారు. పైగా ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని సంవత్సరం క్రితం ప్రకటించకుండా అకస్మాత్తుగా మూడు నెలల ముందు ప్రవేశ పెట్టింది. దీంతో అప్పుడే ఇంటర్ పాసైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీని వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరికీ బోధ పడలేదు. సుమారు 30 కళాశాలల యజమాన్యాలు కోర్టును ఆశ్రయించి తమకు ఆన్‌లైన్ నుంచి మినహాయింపు కావాలని కోరగా, కోర్టు అందుకు సమ్మతించి, అనుమతించింది. కానీ ప్రభుత్వం దీనిని ఛాలెంజ్ చేయలేదు. ఇక ఫీజుల విషయానికి వస్తే ప్రభుత్వం ఫీజు నిర్దేశించడమే కాకుండా యజమాన్యాలకు కళాశాల డెవలప్‌మెంట్ ఫండ్ కింద 10 వేల రూపాయలు వసూలు చేసుకోవడానికీ అనుమతించింది. ఎందుకీ ప్రయోగం చేసిందో అర్థం కావడం లేదు. తుగ్లక్ పనిలా ఉంది.్ఫజు రీయంబర్స్‌మెంట్ తగ్గించుకునే ప్రయత్నమే చేసిందే తప్ప విద్యార్థులకు ఒనగూరింది ఏమీ లేదు. అనేక కళాశాలలపై టాస్క్ఫోర్సు దాడులు చేయించింది. ఫలితంగా ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు-శూన్యమే. డీమ్డ్ వర్సిటీల్లో ఫీజులు అధికంగా వసూలు చేసుకోవడానికి అనుమతించింది. సంబంధిత విద్యా శాఖ మంత్రి అమెరికాలో మకాం వేశారు. ఇక్కడ సమన్వయం చేసి చక్క దిద్దే పరిస్థితి లేదు. చివరకు అనేక వర్సిటీలకు వైస్-్ఛన్సలర్లు లేకపోవడంతో అజమాయిషీ లేకుండా పోయింది. ఈ పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయో!.

డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి