ఫోకస్

ప్రణాళికాబద్ధంగా ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడుతున్నారు. అయితే చదువు ఖరీదుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే బంగారు తెలంగాణలో కేజీ నుంచి పీజి వరకు ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన విద్య అందాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భావించారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో దేశ ప్రధానమంత్రి మొదలుకుని సామాన్యుని పిల్లల వరకు ఒకే విధమైన పాఠశాలల్లో చదువుకుంటారు. అదే విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనవడి నుంచి సామాన్య పేద కుటుంబం పిల్లల వరకు అందరికీ ఒకే విధమైన విద్య లభించాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న విద్యా విధానాన్ని తొలగించి ఒకేసారి కేజీ నుంచి పీజి వరకు విద్యను అందించడం అంత సులభం కాదు. ఒకవైపు ప్రస్తుత విద్యా సంస్థలను కొనసాగిస్తూనే కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను హడావుడిగా కాకుండా పద్దతి ప్రకారం అమలు చేయాలనే ఉద్దేశంతోనే సదస్సులు నిర్వహించి విద్యా వంతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఆలస్యం కావచ్చు కానీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తెలంగాణలో అమలు జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యలో భాగంగానే 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. గురుకుల పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అవుతున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమీషన్‌తో పాటు పలు పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్యాపథకం కింద ఎంతో మంది బడుగు వర్గాల వారికి చదువుకునే అవకాశం లభిస్తోంది. విదేశీ విద్య కోసం తొలుత ప్రభుత్వం పది లక్షల రూపాయల సహాయం అందించింది, ఇప్పుడు దానిని 20లక్షల రూపాయల వరకు పెంచారు. పాఠ్యాంశాల్లో గతంలో తెలంగాణకు స్థానం ఉండేది కాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత మన చరిత్ర మనం తెలుసుకునే విధంగా పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్రను, తెలంగాణ మహనీయుల జీవితాలను చేర్చారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ సిలబస్‌ను సైతం తెలంగాణ కోణంలో మార్చారు. 15 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్‌ఇ సిలబస్ బోధిస్తారు. విద్య ద్వారానే వికాసం సాధ్యం అని విశ్వసించే ప్రభుత్వం తెలంగాణలో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోంది.

ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు