ఫోకస్

కెజి టు పిజి భారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన తర్వాత కెజి టు పిజి ఉచిత విద్య అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఎప్పుడు అమలు చేస్తారోనని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీరా కెజి టు పిజి దాకా ప్రస్తుతం ఫీజుల మోత మోగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజిలు గొడ్ల కొట్టాల్లో, కోళ్లఫారాల్లో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వ్యాఖ్యానించారు. అయితే అలాంటి ఇంజనీరింగ్ కాలేజిల్లో, వృత్తి విద్యా కళాశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఫీజులను ఏ ప్రాతిపదికన పెంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంజనీరింగ్ కాలేజిలలో గతంలో రూ. 60 వేలు ఉంటే దానిని ప్రస్తుతం లక్ష వరకు పెంచారు. ఇక ఎల్‌కెజి నుంచి యుకెజి వరకు ఉన్న ఫీజుల గురించి అయితే చెప్పనలవి కాదు. ఈ-టెక్నో, హై-టెక్నో, ఐఐటి ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఈ పౌండేషన్ అంటూ రకరకాల పేర్లతో ఎల్‌కెజి చదివే విద్యార్థి నుంచి కూడా లక్ష 25 వేల నుంచి లక్ష యాబై వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక ఎస్‌ఎస్‌సి వరకు వచ్చే సరికి కొన్ని ఇంటర్‌నేష్నల్ స్కూల్స్‌ల్లో రూ. 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నరంటే అతిశయోక్తి కాదు. ఇంటర్ విద్యా అయితే అపార్టుమెంట్లలో, షాపింగ్ మాల్స్‌లో కొనసాగుతున్నాయి. విద్యలో సంస్కరణలు ప్రవేశ పెడుతామని, కెజి టు పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది. రాష్ట్రంలో కనీసం యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలపై నియంత్రణ లేకపోవడంతో వారు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, విద్యాసంస్థల మధ్య పోటీతో ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేసింది.

జవ్వాది దిలీప్ కార్యదర్శి ఎబివిపి, గ్రేటర్ హైదరాబాద్