ఫోకస్

‘విద్య’కు సమస్యల ముసురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైంది, ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీలతో పాటు ఈ ఏడాది వృత్తి , సాంకేతిక విద్యా సంస్థల ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు సమస్యలున్నా, ఈ ఏడాది ఆ సమస్యలు హెచ్చుమీరాయి. సౌకర్యాలు కల్పించామని, ఫీజులు పెంచాలని యాజమాన్యాలు కోరడం, కాలేజీల్లో సరిపడా సౌకర్యాలు లేవని, ఫీజులు పెంచలేమని ప్రభుత్వం చెప్పడం రివాజుగా వస్తున్నా, ఈ ఏడాది కొన్ని విద్యాసంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ప్రభుత్వం సైతం కఠిన వైఖరి తీసుకోకతప్పలేదు. ప్రతి మూడేళ్లకు ఒక మారు ఎ.ఎఫ్.ఆర్.సి ఫీజులను ఖరారు చేస్తుంది. ఆ గడువు 2015-16 విద్యాసంవత్సరంతో ముగియడంతో 2016-17 నుండి 2018-19 విద్యాసంవత్సరం వరకూ మూడేళ్ల వ్యవధికి ఫీజులను నిర్ధారించాల్సి రావడంతో రచ్చరచ్చ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం వాస్తవిక పరిస్థితి నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారులతో కూడిన విజిలెన్స్ కమిటీలను వేసింది. ఆంధ్రాలో సైతం అకడమిక్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు చేసిన సిఫార్సులు, పరిశీలనలు ఆధారంగా ఫీజులు, సీట్లు, కాలేజీల సంఖ్య ఖరారైంది. అయితే యాజమాన్యాలకు సైతం ఈ నిర్ణయాలపై సంతృప్తి లేదు, ఫీజులు పెంచాలని, సీట్లు పెంచాలని కోరుతున్నాయి. కొన్ని యాజమాన్యాలు తాడోపేడో తేల్చుకునేందుకు హైకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నాయి. ఇంకో పక్క ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైతం ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరత, సౌకర్యాల కొరత, సదుపాయాల లేమి ఉండనే ఉన్నాయ. తాగునీటి కొరత, విద్యుత్ లేమి, మరుగుదొడ్ల కొరత, విశ్రాంతి గదులు, విద్యార్ధులకు సౌకర్యాల కొరత పట్టిపీడిస్తున్నాయి. స్కూళ్లలో టీచర్లకు బదులు విద్యావలంటీర్లతోనూ, కాలేజీల్లో పార్టుటైమ్ లెక్చరర్లతోనూ ఇరు ప్రభుత్వాలు గట్టెక్కిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) చికాకు ఉండనే ఉంది. ఉపాధ్యాయుల సమస్యలపై అనునిత్యం రాస్తారోకోలు, ధర్నాలు కొనసాగుతునే ఉన్నాయి. యూనివర్శిటీలకు విసిలు లేకపోవడం, వర్శిటీల్లో మూడు వంతుల సిబ్బంది కొరత, విద్యాసంవత్సరం సజావుగా సాగేందుకు పెద్ద అడ్డంకిగా తయారైంది. తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్లకు ఆన్‌లైన్ విధానం అమలులోకి తీసుకురావడంపై విద్యార్ధుల్లో సంతృప్తి వ్యక్తమైనా, గ్రామాలకు చెందిన వారి నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానం వల్లనే తమకు సీట్లు రాలేదని గగ్గోలు పెట్టిన వారు సైతం లేకపోలేదు. విద్యాసంకట స్థితిపై ఈ వారం ఫోకస్...నిపుణుల అభిప్రాయాలు...