ఫోకస్

సామాజిక భద్రతకు ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలచేత ఎన్నుకోబడకపోయినప్పటికీ గవర్నర్లు రాజకీయాలకు దూరంగా, ప్రజాభద్రతకు చేరువగా ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గవర్నర్లు పోషిస్తున్న పాత్ర అదే. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే వారి వారి జీవన విధానం వేర్వేరు కావచ్చు. ప్రజల అవసరాల మేరకో.. ఆధిపత్యం కోసమో గానీ ప్రజాభిప్రాయాలు రాజకీయంగా కలుషితమవుతున్నాయి. ప్రలోభాల మాయో.. అవసరాల నిమిత్తమో.. సమాజం మారిపోతోంది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కారు అంటే.. అధికార పార్టీ గవర్నర్లను నియమిస్తోంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. రాష్టప్రతి అనగానే రబ్బరు స్టాంపు (నామ్‌కే వాస్తే) అని భారతీయుల్లో ముద్ర ఉంది. రాష్టప్రతి, పరిపాలన అంతా అధికార పార్టీ చేతుల్లోనే అనే భావన కూడా ప్రజల్లో ఇమిడి ఉంది. దేశంలోని ఏ రాష్ట్ర గవర్నరయినా ప్రజాభద్రతకు కుట్టుబడే ఉంటారు. ప్రథమ పౌరుడుగానో, ఓ బిడ్డకు తండ్రిగానో, అందరికీ సమ న్యాయం, అందరిపై సమదృష్టి సారిస్తారు. అయితే గవర్నర్లు అధికార పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని, పాలకుల కనుసన్నల్లో ఉంటున్నారనే భావనను ప్రజలనుంచి తొలగింపజేయాలి. ఇది స్వతహాగా గవర్నర్లయినా చేయవచ్చు లేదా పాలక వర్గాలు కూడా చేయవచ్చు. ప్రస్తుతం ఇది అనివార్యం కూడా. రాజ్యాంగ బద్దంగా వీరు ప్రజాస్వామ్య పరిరక్షణకే కట్టుబడి ఉంటున్నారు. కానీ అధికార పార్టీలవైపే మొగ్గుచూపుతారనే అపోహ తొలగించుకోవాలి. గవర్నర్ పదవి అంటే సామాజిక భద్రతకు ప్రతీక. అలాంటి బాధ్యతగల పదవీలో కొనసాగే గవర్నర్లు ఏ రాజకీయ పార్టీకో, ఏ అధికార పార్టీ నాయకులకో లోబడి ఉండకూడదు. కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల ఏకాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే విధంగా ఉంటోందని విమర్శలు లేకపోలేదు. అలా అని గవర్నర్లను అనుమానించడం, అవమానించడం తగదు. ఏదీ ఏమైనా గవర్నర్ల బాధ్యత చాలా గొప్పది.

- జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ కన్వీనర్