ఫోకస్

అనుసంధానం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ల వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య అనుసంధానం ఉండాలి. మనది సమాఖ్య తరహా వ్యవస్థ. ఏ సంఘటన జరిగినా ఒకవేళ ప్రభుత్వ నియంత్రణ తప్పినప్పుడు తప్పనిసరిగా గవర్నర్ రంగంలోకి వస్తారు. ఆంధ్ర, తెలంగాణ గవర్నర్‌ను చూడండి. ఇరువురు సిఎంలు కలుస్తున్నారు. సమస్యలను విన్నవిస్తున్నారు. పరిష్కారం సంగతి సరే. గ్రౌండ్ లెవల్‌లో ఏమి జరుగుతుందనే విషయం గవర్నర్‌కు, ఆయన ద్వారా కేంద్రానికి తెలుస్తుంది. గవర్నర్ నైతికతతో వ్యవహరించాలి. పక్షపాత వైఖరి పనికిరాదు. దీనివల్ల గవర్నర్‌కు చెడ్డపేరు వస్తుంది. జిల్లా కలెక్టర్, గవర్నర్‌కు తేడా ఏమీ లేదు. వాస్తవానికి జిల్లా కలెక్టర్‌కు ఫలానా అధికారాలున్నాయని రాజ్యాంగంలో లేదు. జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు కొన్ని ఉంటాయి. కాని జిల్లాలో ప్రతి అంశంలో కలెక్టర్ ప్రమేయం ఉంటుంది. కలెక్టర్‌కు ప్రతి అంశాన్ని ప్రతి అధికారి, శాఖ నివేదిస్తుంది. గవర్నర్ ఒక పెద్ద మనిషిలా వ్యవహరిస్తే గౌరవం పెరుగుతుంది. మనం ఎంత సేపు రాజ్యాంగపరమైన అధికారాలు గురించి చర్చిస్తుంటాం. రోజూవారీ ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ తలదూర్చరాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఆ పార్టీ సమావేశాల్లో ఏమి కొట్టుకున్నా, గవర్నర్‌కు సంబంధం లేదు. కాని ఏమి జరుగుతుందో తెలుసుకోవడం గవర్నర్ విధి. అంతేకాని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలకు గవర్నర్ పాల్పడరాదు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో గవర్నర్ పాత్ర తీవ్ర విమర్శలకు లోనైంది. సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ పరిధికి మించి వ్యవహరించడం మంచిది కాదు. కాలక్రమంలో గవర్నర్ వ్యవస్థ రాజకీయాలకు లోనైంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లేదా బిజెపి తమకు కావాల్సిన వారిని గవర్నర్ పదవిలో నియమిస్తుంది. దీనివల్ల కీలక సమయాల్లో తాము చెప్పినట్లు గవర్నర్ వింటాడని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతాయి. ఇది విచారకరమైన విషయం. కర్నాటక గవర్నర్‌గా పనిచేసిన భరద్వాజపై విమర్శలు వచ్చాయి. న్యాయ కోవిదులు, పక్షపాత రహితంగా ఉండే పెద్దవారిని, సామాజిక స్పృహ ఉన్నవారిని గవర్నర్‌గా నియమించాలి. గవర్నర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి.

- పద్మనాభయ్య కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి