ఫోకస్

గవర్నర్లు కీలకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్లిష్ట సమయంలో గవర్నర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర కీలకం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో, ఏ పార్టీకి మెజారిటీ రాని సమయంలో గవర్నర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. దీనికే గవర్నర్లు పరిమితం కారాదు. మిగిలిన సమయంలో విద్యా రంగంలో, కళా సాంస్కృతిక రంగాల్లో గవర్నర్లు కృషి చేయవచ్చు. అలా చేసి ఆదర్శంగా నిలిచిన గవర్నర్లు ఎంతో మంది ఉన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధాన కర్తగా గవర్నర్లు ఉండాల్సిందే. అయితే రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించే విధానం మారాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తమ పార్టీ వారిని గవర్నర్లుగా నియమిస్తోంది. దేశంలో ఈ విధానం ఎప్పటినుంచో ఉంది. బిజెపి సైతం అదే విధానాన్ని అవలంభించింది. గవర్నర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పెత్తనం చెలాయించాలి అనే ధోరణితో కాకుండా దేశంలో ఐక్యతకు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా గవర్నర్ల వ్యవస్థ ఉండాలి. ఉత్తర ప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసిన మున్షి విద్యారంగంలో ఎంతో సేవ చేశారు. ఆయా రంగాలకు చెందిన వారికి సలహాలు ఇచ్చేవారు. గవర్నర్ చాన్సలర్ హోదాలో విశ్వవిద్యాలయాల్లో విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు తరుచూ సమావేశాలు నిర్వహించేవారు. రాజకీయ పార్టీలకు చెందినవారు, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులను గవర్నర్లుగా నియమిస్తూ హుందాతనాన్ని తగ్గించారు. మేధావులను, న్యాయవ్యవస్థలో అనుభవం గల వారిని గవర్నర్లుగా నియమించాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేసిన తరువాత షిండే తిరిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తరువాత తొలి గవర్నర్ చందూలాల్ త్రివేది సమర్థుడైన గవర్నర్‌గా పేరు తెచ్చుకున్నారు. మద్రాస్ నుంచి కర్నూలు రాజధానిగా పాలన ప్రారంభం కాగానే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాలన సజావుగా సాగడంలో ఆయన కీలకపాత్ర వహించారు. అప్పుడు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చతుర్వేది ముఖ్యమంత్రికి ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలున్నాయి. గవర్నర్‌గా నరసింహాన్ ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించి సయోధ్య సాధించాలి.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి