ఫోకస్

గవర్నర్ల పాత్ర పరిమితమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ల అధికారాలు, పరిధి, విస్తృతి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత కాగా, గవర్నర్ రాష్ట్ధ్రానేతగా వ్యవహరిస్తారు. వాస్తవానికి గవర్నర్ పదవి నామకార్థమైనదే, భారత రాష్టప్రతికి ప్రతినిధిగా రాష్ట్రాలకు గవర్నర్లు వ్యవహరిస్తారు. ఐదేళ్ల పదవీకాలానికి గవర్నర్లను రాష్టప్రతి నియమిస్తారు. గవర్నర్ నియామకం రాజ్యాంగంలోని 157వ ప్రకరణ ప్రకారం జరుగుతుంది. గవర్నర్లకూ విస్తృతమైన అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. క్షమాభిక్ష అధికారం, కమిషన్ల నియామకాలు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంతోపాటు కార్యనిర్వాహక అధికారాలైన పరిపాలన, నియామకాలు, తొలగింపులు, శాసనాధికారాలైన రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు గవర్నర్ సొంతం. వీటికితోడు గవర్నర్లకు ప్రత్యేకించి విచక్షణాధికారాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించే అధికారం కూడా 7వ రాజ్యాంగ సవరణ ద్వారా అవకాశం కల్పించారు. గవర్నర్ల పాత్ర ఎంత వివాదాస్పదమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే చూశాం.
తర్వాత గవర్నర్ల పాత్రపై జరిగిన రాద్దాంతం ఇంతాఅంతా కాదు, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ వివాదంలో గవర్నర్ పాత్రను తప్పుపడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు అసాధారణమైంది. గవర్నర్ పాత్ర చాలా విస్తృతమైనదన్నట్టు కనిపిస్తున్నా, అది ఎంత పరిమితమైందో కూడా రాజ్యాంగపీఠం స్పష్టంగా వివరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో డిసెంబర్ 15 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఒక్కసారి కాలం వెనక్కు వెళ్లింది. మంత్రివర్గానికి బదులు గవర్నర్లు నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం భారతదేశంలో కొత్త కాదు, గతంలో చాలా ఎక్కువగానే సాగింది. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి లెక్కవేస్తే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, కేంద్ర పాలన విధించిన ఉదంతాలు వందకు పైగానే ఉంటాయి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని 1994లో బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. దీంతో ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఊరటగా భావించారు. ఉత్తరాఖండ్‌లో సుప్రీంకోర్టు చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణ జరిగింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా గవర్నర్ రాజ్‌ఖోవా పాత్రను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గవర్నర్ ఎన్నికైన ప్రజా ప్రతినిధి కాదని, మంత్రివర్గం సూచనల మేరకు నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సూచనలు లేకుండానే అసెంబ్లీని సమావేశపరచడం, రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీల అంతర్గత గొడవలకు గవర్నర్ దూరంగా ఉండాలని, అవి గవర్నర్‌కు సంబంధించిన వ్యవహారాలు కాదని వివరించింది. రాజకీయ కుట్రలకు, ఫిరాయింపుల ప్రోత్సాహానికి పాల్పడకూడదని కూడా చెప్పింది. శాసనసభకు విచారణాధికారిగా, స్పీకర్‌కు సలహాదారునిగా వ్యవహరించడం గవర్నర్ పాత్ర కాదని కూడా పేర్కొంది. ఈ క్రమంలో గవర్నర్‌ల పాత్రపై పలువురు ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.